Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కోమాలో తల్లిదండ్రులు.. చెల్లెలే దిక్కై అన్నకు అంత్యక్రియలు చేసిన వైనం

కోమాలో తల్లిదండ్రులు.. చెల్లెలే దిక్కై అన్నకు అంత్యక్రియలు చేసిన వైనం

వార్త 3 months ago

Bhadradri Road Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం ఒక నిండు కుటుంబాన్ని రోడ్డున పడేసింది. కన్నకొడుకు కళ్ల ముందే ప్రాణాలు విడవగా, తల్లిదండ్రులు ఆసుపత్రి బెడ్‌పై కోమాలో కొట్టుమిట్టాడుతున్నారు.

ఏం చేయాలో పాలుపోని స్థితిలో, కన్నీరు మున్నీరవుతూ ఆ ఇంటి కుమార్తె తన అన్నకు అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. బూర్గంపహాడ్‌ మండలంలో సోమవారం జరిగిన ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

Read Also : contract employees dharna: కోఠి డిఎంఇ కార్యాలయం ముందు యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ధర్నా

 Parents in coma… Sister performs last rites for brother

వివరాల్లోకి వెళితే… కరకగూడెం మండలానికి చెందిన ఆడెపు సతీశ్‌, స్వప్న దంపతులకు కొడుకు మనోహర్‌ (19), కూతురు మాధురి ఉన్నారు. గతంలో జరిగిన ఒక ప్రమాదంలో తండ్రి సతీశ్‌ తలకు తీవ్ర గాయమైంది. ఆ గాయానికి సంబంధించి తదుపరి వైద్య పరీక్షల కోసం ఆయన తన భార్య స్వప్న, కొడుకు మనోహర్‌లతో కలిసి ఆటోలో భద్రాచలం బయల్దేరారు. అయితే, విధి ఆ కుటుంబాన్ని మరో రూపంలో వెంటాడింది. వారు ప్రయాణిస్తున్న ఆటో బూర్గంపహాడ్‌ మండలం కోయగూడెం వద్దకు రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది.

Bhadradri Road Accident: ఫ్రీజర్‌లోనే అన్న మృతదేహం.. కోలుకోని తల్లిదండ్రులు

ఈ ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొడుకు మనోహర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మరోవైపు తండ్రి సతీశ్‌, తల్లి స్వప్న ఇద్దరూ తలకు బలమైన గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లారు. ఇంట్లో మిగిలిన ఏకైక కుమార్తె మాధురికి ఏం చేయాలో తోచలేదు. తన తల్లిదండ్రులు కోమా నుంచి కోలుకుని తిరిగి వస్తారనే చిన్న ఆశతో, అన్న మృతదేహాన్ని రెండు రోజుల పాటు ఫ్రీజర్‌ బాక్స్‌లోనే ఉంచి ఎదురుచూసింది. కనీసం తల్లిదండ్రులైనా వచ్చి అన్నకు చివరి వీడ్కోలు పలుకుతారని ఆ చిన్నారి ఆరాటపడింది.

అన్న అంత్యక్రియలు చేసిన చెల్లె

సోమవారం నాటికి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. వారు కోమా నుంచి బయటకు రాకపోవడంతో, ఇక లాభం లేదని భావించిన బంధువులు, గ్రామస్థులు మాధురిని ఓదార్చారు. చివరికి అందరి సహాయంతో, మాధురి తన అన్న మనోహర్‌కు అంత్యక్రియలు పూర్తి చేసింది. రక్షణగా ఉంటాడనుకున్న అన్న దూరమవ్వడం, తల్లిదండ్రులు మృత్యువుతో పోరాడుతుండటంతో ఆ బాలిక పరిస్థితి చూసి స్థానికులు కన్నీరు పెట్టారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కన్నకూతురిపైనే అఘాయిత్యం..పోక్సో చట్టం కింద నేరం రుజువు కావడంతో కోర్టు ఘాటు నిర్ణయం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha