Revanth Reddy: తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమావేశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యంగా కొండా సురేఖ అంశంపై ఇకపై పార్టీ నేతలందరూ మౌనంగా ఉండాలని, ఈ విషయమై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని ఆయన స్పష్టమైన ఆదేశాలు జూశారు. సురేఖ అంశాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని తేల్చిచెప్పారు.

మీడియా సమావేశాలపై హెచ్చరికలు
మీడియా సమావేశాల్లో లేదా ఇంటర్వ్యూలలో జర్నలిస్టులు ఈ అంశంపై ఎంతగా ప్రశ్నించినా, తాను ఎలాంటి చర్చకు తావివ్వబోనని సీఎం స్పష్టం చేశారు. పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ కమిటీ తగిన చర్యలు తీసుకుంటుందని గతంలోనే స్పష్టం చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేశారు.
Revanth Reddy: సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఈ సమావేశంలో కేవలం రాజకీయ పరిణామాలపైనే కాకుండా రాబోయే శాసనసభ సమావేశాల నిర్వహణపై కూడా చర్చించారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి నేతలకు వెల్లడించారు. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రభుత్వ పరంగా ప్రవేశపెట్టాల్సిన అంశాలపై సన్నద్ధంగా ఉండాలని సూచించారు.
Epaper: epaper.vaartha.com

