Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'కొరియన్ కనకరాజు' తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

'కొరియన్ కనకరాజు' తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

వార్త 2 weeks ago

Korean Kanakaraju : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, ప్రతిభావంతుడైన దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్లో తెరకెక్కిన సరికొత్త ఎంటర్‌టైనర్ 'కొరియన్ కనకరాజు' థియేటర్లలో గ్రాండ్ ఆడియన్స్ రెస్పాన్స్‌తో గ్రాండ్ ఓపెనింగ్‌ను సాధించింది.

ప్రదర్శితమైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం, ప్రీమియర్ షోల కలెక్షన్లతో కలిపి తొలిరోజే ఏకంగా రూ.10.20 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వరుణ్ తేజ్ సినీ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్ సాధించిన సినిమాగా 'కొరియన్ కనకరాజు' సరికొత్త రికార్డును నెలకొల్పడం గమనార్హం.

మేర్లపాక గాంధీ మార్క్ కామెడీ & థమన్ మ్యూజిక్ మ్యాజిక్

భిన్నమైన కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమాకి సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మేర్లపాక గాంధీ మార్క్ హిలేరియస్ కామెడీ, డిఫరెంట్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను థియేటర్లలో విశేషంగా అలరిస్తుండటంతో వీకెండ్‌లో కూడా ఈ కలెక్షన్ల గ్రాఫ్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వరుణ్ తేజ్ సరికొత్త లుక్ అండ్ టైమింగ్ అభిమానులను అమితంగా ఆకట్టుకోవడంతో పాటు ఈ బాక్సాఫీస్ సక్సెస్ వరుణ్ తేజ్ మార్కెట్‌కు పెద్ద మైలేజ్‌ను అందించింది.

ఈనెల 12న రవితేజ 'ఇరుముడి' ట్రైలర్ విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha