Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కోర్పోల్ గ్రామసభలో పారిశుధ్యం, గ్రామ భద్రతపై కీలక నిర్ణయాలు

కోర్పోల్ గ్రామసభలో పారిశుధ్యం, గ్రామ భద్రతపై కీలక నిర్ణయాలు

వార్త 2 months ago

Sangareddy news: సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండల పరిధిలోని కోర్పోల్ గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామసభలో పారిశుధ్యం, తడి-పొడి చెత్త సేకరణ, గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు, మద్యపాన నిషేధం అమలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలను గ్రామసభలో ఆమోదించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సునీత మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రతను కాపాడడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. వారిని గౌరవించడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని పారిశుధ్య సిబ్బందికి సహకరించాలని కోరారు.

Read also: Aditya Mehta Foundation: పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా

 Key decisions on sanitation and village safety in Korpol Gram Sabha

Sangareddy news: నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా

గ్రామ పెద్ద కుమ్మరి మాచెందర్ మాట్లాడుతూ మోరీలలో లేదా బహిరంగ ప్రదేశాల్లో ఖాళీ నీటి సీసాలు, గ్లాస్ బాటిళ్లు, చెత్త వేయరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ.500 జరిమానా విధించాలని గ్రామసభలో నిర్ణయించినట్లు తెలిపారు. ఉప సర్పంచ్ ప్రవీణ్ అప్పా మాట్లాడుతూ గ్రామంలోని పారిశుధ్య కార్మికులకు తక్షణమే జీవిత బీమా సౌకర్యం కల్పించాలని ప్రతిపాదించారు. అలాగే కాసల స్వప్న, బోయినీ మీనాలు పారిశుధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులను అందజేయాలని సూచించారు.

భద్రతకు సీసీ కెమెరాలు, విద్యా రంగంపై సూచనలు

గ్రామ యువ నాయకుడు మన్నే అరుణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రధాన కూడళ్లలో ఈ నెలలోనే 15 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి గ్రామ భద్రతను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.జిల్లా మమత మాట్లాడుతూ పిల్లలకు ఒత్తిడి లేని, తల్లిదండ్రులకు ఆర్థిక భారం తక్కువగా ఉండే విద్యను అందించేందుకు ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ, హైస్కూల్ స్థాయిలలో విద్యార్థుల చేరికలను పెంచాలని సూచించారు. గ్రామస్థులు మాట్లాడుతూ గతంలో అమలు చేసిన మద్యపాన నిషేధాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలు విధించాలని కోరారు.

కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, గ్రామస్థులు

ఈ గ్రామసభలో గ్రామ కార్యదర్శి మల్లేశం, వాటర్ డిపార్ట్మెంట్ ఏఈ నాగ సాయి, వార్డు సభ్యులు డి. ప్రభు, గూదే మమత, మల్లేశం, ధనంపల్లి శ్రీను, మన్నే అనసూయ, గ్రామ ప్రజలు బసవన్నగారి వెంకట్ రెడ్డి, చందాపురం రమేష్, పుట్టి మోహన్, మన్నే సత్యం, దేవదాస్, మన్నే అనిల్, జగంపేట్ శంకర్, కడియాల సంగమేశ్వర్, ధనంపల్లి విష్ణుతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి, పరిశుభ్రత, భద్రతకు సంబంధించిన పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

కాగజ్‌నగర్ జిల్లాలో మట్టి మాఫియాపై అధికారుల ఉక్కుపాదం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha