BLA Suicide Attack Jiwani: తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు వేర్పాటువాద సంస్థ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) మరోసారి మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చింది.
బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని అత్యంత వ్యూహాత్మక గ్వాదర్ జిల్లా జివానీ పరిధిలో గల పాకిస్థాన్ కోస్ట్ గార్డ్స్ ప్రధాన సైనిక శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని బీఎల్ఏ గురువారం (జూలై 2) సాయంత్రం భీకర ఆత్మాహుతి దాడికి తెగబడింది. ఈ దారుణ ఘటనలో 30 మందికి పైగా పాకిస్థానీ జవాన్లు అక్కడికక్కడే మరణించగా, డజన్ల కొద్దీ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన గ్వాదర్ తీర ప్రాంతంలోనే ఈ స్థాయి విద్వంసం జరగడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
పేలుడు పదార్థాల ట్రక్కుతో క్యాంప్ ధ్వంసం..

బీఎల్ఏ మీడియా విభాగం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. జూలై 2వ తేదీ సాయంత్రం సుమారు 6.32 గంటల సమయంలో ఈ ఆపరేషన్ జరిగింది.
- మజీద్ బ్రిగేడ్ ఘాతుకం: బీఎల్ఏకు చెందిన అత్యంత ప్రమాదకరమైన ఆత్మాహుతి దళం ‘మజీద్ బ్రిగేడ్’ సభ్యుడు అల్తావుల్లా బలోచ్ అలియాస్ అజ్మల్ ఈ దాడికి నాయకత్వం వహించాడు. భారీగా పేలుడు పదార్థాలు నింపిన ఒక మాజ్డా (Mazda) ట్రక్కును వేగంగా కోస్ట్ గార్డ్స్ క్యాంప్ లోపలికి దూకించి పేల్చివేశాడు.
- ఫతే స్క్వాడ్ కాల్పుల కలకలం: ఈ భారీ పేలుడు ధాటికి సైనిక స్థావరం పూర్తిగా శిథిలమవ్వగా.. తక్షణమే రంగంలోకి దిగిన బీఎల్ఏ ‘ఫతే స్క్వాడ్’ సాయుధ కమాండోలు తుపాకులతో లోపలికి చొరబడ్డారు. ప్రాణాలతో మిగిలి ఉన్న భద్రతా సిబ్బందిపై అత్యంత సమీపం నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
మౌనం వహిస్తున్న పాక్ సైన్యం – హైటెన్షన్!
ఈ ఘోర పరాజయం మరియు భారీ ప్రాణనష్టంపై పాకిస్థాన్ ప్రభుత్వం గానీ, అక్కడి సైనిక ప్రచార విభాగం (ISPR) గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకుండా మౌనం వహిస్తున్నాయి. బలూచిస్థాన్ అంతటా అంతర్జాతీయ మీడియాపై పాక్ సైన్యం కఠిన ఆంక్షలు విధించడంతో ఖచ్చితమైన మరణాల సంఖ్యను స్వతంత్రంగా ధృవీకరించడం కష్టంగా మారింది. అయినప్పటికీ, ఈ ప్రతీకార దాడి తర్వాత గ్వాదర్ తీర ప్రాంతమంతా అదనపు బలగాల మోహరింపుతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
BLA Suicide Attack Jiwani: దశాబ్దాల సాయుధ పోరాటం..
బలూచిస్థాన్ ప్రావిన్స్‌కు పూర్తి స్వయంప్రతిపత్తి కల్పించాలని, తమ ప్రాంతంలోని గ్యాస్, ఖనిజాలు వంటి సహజ వనరులను పాక్ ప్రభుత్వం దోచుకుంటోందని బీఎల్ఏ దశాబ్దాలుగా సాయుధ పోరాటం చేస్తోంది. పాక్ సైన్యాన్ని ‘ఆక్రమణ దారులు’గా అభివర్ణించే ఈ సంస్థ.. తమ పూర్తి స్వాతంత్ర్యం సిద్ధించేవరకు దాడులు ఆపబోమని, ముఖ్యంగా చైనా పెట్టుబడులను లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టం చేసింది.
Epaper: epaper.vaartha.com
మరణించిన నాలుగు నెలల తర్వాత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు.. ఆలస్యంగా ఎందుకు?

