Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కోత సమయంలో వర్షాల ముప్పు..  ఆందోళనలో రైతన్నలు

కోత సమయంలో వర్షాల ముప్పు.. ఆందోళనలో రైతన్నలు

వార్త 1 day ago

Heavy rains alert:ఆంధ్రప్రదేశ్ లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా ఈ నెల 25వ తేదీ నుంచి వాతావరణంలో మార్పులు రానున్నాయి.

ఈ వర్షాల వార్త రాష్ట్రంలోని రైతన్నలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చేతికి వచ్చే దశలో ఉన్న పంటలు దెబ్బతింటాయని అన్నదాతలు భయపడుతున్నారు.

Rain Alert : రైతులకు పిడుగులాంటి వార్త

 Threat of rain during harvest

కోత దశకు వచ్చిన వరి పంట

రాష్ట్రంలో మరో వారంలో వరి కోతలు ప్రారంభం కావాల్సి ఉంది. సరిగ్గా ఈ సమయంలో భారీ వర్షాలు కురిస్తే వరి పంట నేలచూపులు చూసే ప్రమాదం ఉంది. తడిసిన ధాన్యం మొలకెత్తడం లేదా రంగు మారిపోవడం జరుగుతుంది. దీనివల్ల రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ పరిణామాల కారణంగా భవిష్యత్తులో బియ్యం ధరలు కూడా విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Heavy rains alert:ఇతర పంటలపై వర్షాల ప్రభావం

వరితో పాటు మొక్కజొన్న, పెసర, మినుము అలాగే పత్తి పంటల కోతలు కూడా ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సమయంలో వర్షాలు పడితే ఈ వాణిజ్య పంటలు కూడా తీవ్రంగా దెబ్బతింటాయి. ప్రభుత్వం నవంబర్ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే వర్షాల కారణంగా కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం జరిగే అవకాశం ఉంది.

Epaper: epaper.vaartha.com

జోగి రమేశ్ కోడలు కారు ప్రమాదంపై ఫిర్యాదు.. తెరపైకి కుట్ర ఆరోపణలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha