Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతులకు పిడుగులాంటి వార్త

రైతులకు పిడుగులాంటి వార్త

వార్త 1 day ago

Rain Alert : తెలుగు రాష్ట్రాల రైతులకు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త అందించింది. నేడు బంగాళాఖాతంలో నూతనంగా అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో, ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

దీంతో సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలో వర్ష ముప్పు ఎదురవ్వడంతో ఖరీఫ్ పంటలు దక్కుతాయో లేదోనని అన్నదాతల్లో తీవ్ర కలవరం మొదలైంది. మరో వారంలో వరి కోతలు ప్రారంభం కానున్న తరుణంలో, నవంబర్ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. సరిగ్గా ఈ కీలక సమయంలో వర్షాలు కురిస్తే కోతకు వచ్చిన వరి పంట నేలకొరిగి, తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇతర పంటలపైనా వర్ష ప్రభావం - బియ్యం ధరలు పెరిగే ఆస్కారం

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వరితో పాటు మొక్కజొన్న, పెసర, మినుము, పత్తి పంటల కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ దశలో కురిసే వర్షాల వల్ల ధాన్యం తడిసిపోవడమే కాకుండా రంగు మారి మార్కెట్లో సరైన మద్దతు ధర లభించక రైతులు కోలుకోలేని దెబ్బ తింటారు. అంతేకాకుండా, వర్షాల వల్ల ఖరీఫ్ ధాన్యం దిగుబడి తగ్గితే మార్కెట్లో బియ్యం కొరత ఏర్పడి, రానున్న రోజుల్లో బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కావున రైతులు తమ కోతల ప్రక్రియలో జాగ్రత్తలు వహించాలని, ధాన్యం తడవకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఏపీలో అలాయ్-బలాయ్ పెట్టాలంటూ వీహెచ్ సూచన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha