Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొత్త పింఛన్ల దరఖాస్తుకు ఆగస్టు 31 వరకే చాన్స్!

కొత్త పింఛన్ల దరఖాస్తుకు ఆగస్టు 31 వరకే చాన్స్!

వార్త 1 month ago

Telangana Cheyutha Scheme: రాష్ట్రంలోని అర్హులైన పేదలు, బలహీన వర్గాలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

‘చేయూత’ పథకం కింద కొత్త పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుడుతూ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన లబ్ధిదారులు ఆగస్టు 31వ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని ప్రభుత్వం సూచించింది.

Read Also: Anganwadi new menu: అంగన్‌వాడీ పిల్లలకు ఎగ్ ఫ్రైడ్ రైస్ మెనూ

Telangana Cheyutha Scheme: దరఖాస్తు నిబంధనలు, పత్రాలు

గతంలో ‘ప్రజాపాలన’ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా జతచేయాల్సి ఉంటుంది. వితంతువులు భర్త డెత్ సర్టిఫికేట్, ఒంటరి మహిళలు సెపరేషన్ నివేదిక, గీత కార్మికులు ఎక్సైజ్ శాఖ సర్టిఫికేట్, చేనేత కార్మికులు చేనేత శాఖ సర్టిఫికేట్, మరియు ఫైలేరియా బాధితులు వైద్య ఆరోగ్య శాఖ అందించే హెల్త్ సర్టిఫికేట్లను దరఖాస్తు ఫారంతో పాటు అందించాల్సి ఉంటుంది.

గడువులోగా దరఖాస్తు చేసుకున్న వారికే పింఛన్లు

నిర్ణీత గడువులోగా వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలించి, అర్హులైన వారికి త్వరితగతిన కొత్త పింఛన్లను మంజూరు చేయనున్నారు. అర్హత కలిగిన ప్రతీ ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Epaper: epaper.vaartha.com

ఉచిత పథకాల కేసు సోమవారానికి వాయిదా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha