Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కోతుల భయంతో కొండపై నుంచి పడి నవవధువు మృతి

కోతుల భయంతో కొండపై నుంచి పడి నవవధువు మృతి

వార్త 1 week ago

Tamil Nadu: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో గుండెలవిసే విషాద ఘటన చోటుచేసుకుంది. పురిటి నిండని నూరేళ్ల జీవితం నెల రోజులకే ముగిసిపోయింది. భర్తతో కలిసి దైవదర్శనానికి వెళ్లిన ఓ నవవధువు, కొండపై నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయింది.

కళ్లెదుటే భార్య అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆ భర్త కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. తూత్తుకుడిలోని సౌత్ తిట్టన్‌కుళం ప్రాంతానికి చెందిన అనిత (24)కు, విదేశాల్లో ఉద్యోగం చేసే సురేశ్ (29)తో గత నెలలోనే అత్యంత వైభవంగా వివాహమైంది. ఇటీవల సెలవులపై ఇంటికి వచ్చిన సురేశ్‌తో కలిసి అనిత కలుగుమలైలోని ప్రసిద్ధ కలుగసాలమూర్తి ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లింది.

Read also: Bangalore road accident: బైక్‌పై వెళ్తుండగా తలపై పడ్డ ఎండిన చెట్టు కొమ్మ.. కోమాలోకి వెళ్లిన వ్యక్తి!

 Newlywed dies after falling from hill out of fear of monkeys.

Tamil Nadu: కోతుల గుంపు భయంతో ఘోర ప్రమాదం

ప్రధాన ఆలయంలో పూజలు ముగించుకున్న అనంతరం, ఈ కొత్త జంట కొండపై ఉన్న ఉచ్చిపిళ్లైయార్ గుడికి చేరుకున్నారు. అక్కడ ఉన్న కోతులకు అనిత పండ్లు పెడుతుండగా, ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కోతులు ఆమెను చుట్టుముట్టాయి. దీంతో అనిత తీవ్ర భయాందోళనలకు గురైంది. ఆ కంగారులో వెనక్కి అడుగులు వేస్తూ అదుపుతప్పి కొండపై నుంచి కిందపడిపోయింది. తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

పోలీసుల ప్రాథమిక విచారణ

కోతులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో భయపడే ఆమె కిందపడిపోయి ఉంటుందని దీనిపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నాం అని ఓ ఉన్నత పోలీసు అధికారి తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న కలుగుమలై పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండ కింద పడిపోయిన అనిత మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

భర్త, అత్త వేధింపులతో గర్భిణి ఆత్మహత్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha