Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కౌడిపల్లిలో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి

కౌడిపల్లిలో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి

వార్త 1 week ago

Nagula Panchami:తెలంగాణ సాంప్రదాయ సంస్కృతిలకు ప్రత్యేకగా నిలిచిన నాగుల పంచమి పర్వదినాన నాగదేవతకు తెలుగింటి ఆడపడుచులు పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేయడం అనాదిగా వస్తున్న విశేష ఆనవాయితీ అని జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ పేర్కొన్నారు.

సోమవారం నాడు మండల కేంద్రమైన కౌడిపల్లిలోని గ్రామ దేవత ఆలయాల వద్ద గ్రామ మహిళలు నాగుల పంచమి పర్వదినం పురస్కరించుకొని పుట్టలో పాలు పోసి నాగ దేవతకు ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ సైతం కుటుంబ సభ్యులతో విచ్చేసి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగదేవత కృపాకటాక్షలతో రైతన్నలు సుభిక్షంగా జీవించాలని ఆయన అన్నారు. రైతులు వ్యవసాయ క్షేత్రాలలో తమ పనుల్లో మునిగి ఉన్నప్పుడు పొలాలలో సంచరించే నాగుపాములు రైతులను కాపాడాలని ఆయన నాగదేవతకు ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు.

Read also: Siddipet : డబ్బు కోసం కొడుకును కిల్లర్ గా మార్చిన తల్లి

 Nagula Panchami festival celebrations

Nagula Panchami:ఆలయాల వద్ద భక్తి పారవశ్యం

నాగుల పంచమి పురస్కరించుకొని గ్రామంలోని మహిళలు నూతన వస్త్రాలు ధరించి, పెద్ద ఎత్తున గ్రామ దేవత ఆలయాలైన శ్రీ పోచమ్మ, ఎల్లమ్మ ఆలయాల వద్ద గల నాగులమ్మ పాము పుట్టలో పాలు పోసి నవేద్యాల సమర్పించి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి గ్రామ సర్పంచ్ కుటుంబ సభ్యులతో పాటు ఉప సర్పంచ్ శ్వేతా మల్లికార్జున్ గౌడ్, మాజీ ఎంపీటీసీ కాలేరు మంజుల శివాంజనేయులు, కాంగ్రెస్ నాయకులు మట్ట నీరజ బుచ్చిరెడ్డి, పొన్నం లావణ్య మనోహర్ గౌడ్, రాగుల లావణ్య భూమయ్య పటేల్, చంద్రం సరిత కిషోర్ గౌడ్, గుడ్డంల లక్ష్మీ శరత్, నిర్మల దుర్గయ్య, జిల్లా ఆర్యవైశ్య సంఘ ఉపాధ్యక్షులు కౌడా శ్రీనివాస్ గుప్తా, నాన్ల వెంకటేశం గుప్తా, కురుమ సంఘం జిల్లా నాయకులు ముంబై లక్ష్మణ్ యాదవ్, ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు మాటూరి శాఖయ్య, రమేష్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, పుండరీకం గౌడ్, దుర్గా గౌడ్, గ్రామ వార్డు సభ్యులు దేవేందర్ కుమార్, అజ్మీర్ రమేష్, మక్బూల్, సందీప్ కుమార్, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 Nagula Panchami festival celebrations

Epaper: epaper.vaartha.com

యాదగిరిగుట్ట భక్తులకు గుడ్ న్యూస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha