Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కౌడిపల్లిలో ఘనంగా వాసవి శ్రీ కన్యకా పరమేశ్వరి మాత జయంతోత్సవాలు

కౌడిపల్లిలో ఘనంగా వాసవి శ్రీ కన్యకా పరమేశ్వరి మాత జయంతోత్సవాలు

వార్త 1 month ago

Medak: మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో గల శ్రీ అభయ రామాలయంలో ఆర్యవైశ్యుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కౌడా శ్రీనివాస్ గుప్త ఆధ్వర్యంలో వాసవి శ్రీ కన్యకా పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు శ్రీ అభయ రామాలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి ఆలయ పూజారి పనింద్ర శర్మ వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం స్వీట్లు పంపిణీ చేసి ఆనందోత్సవంలో మునిగిపోయారు ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు కౌడా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ మన కులదైవం ఆడపడుచు గా ఆరాధించబడిన మాత వాసవి కన్యకా పరమేశ్వరి ఆయన అన్నారు.

Read Also:Women Empowerment Scheme:తెలంగాణలో ఉచిత కుట్టు మిషన్ల పథకం

Medak: పాల్గొన్న ప్రముఖులు

కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి వాసవి శ్రీ కన్యకాపరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం అర్శించదగ్గ విషయమని అన్నారు. ఆర్యవైశ్యుల ఆర్థిక అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఈయనతోపాటు కౌడిపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఉడతా వెంకటేశం గుప్తా నాయకులు ఉడుత మురళి గుప్తా ఉడుత రాజు గుప్తా నాన్ల వెంకటేశం గుప్తా బాలకిషన్ గుప్తా మండల కురుమ సంఘం అధ్యక్షులు ముంబై లక్ష్మణ్ చుక్కాపురం ప్రశాంత్ గుప్తా నర్సింలు గుప్తా శ్రీధర్ గుప్తా లతో పాటు ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

రూ. 10 కర్రీ కోసం ఘర్షణ: అన్నదమ్ములపై తల్వార్‌తో దాడి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha