Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కోయిల్‌సాగర్ ప్రాజెక్ట్ నుంచి సాగునీరు విడుదల

కోయిల్‌సాగర్ ప్రాజెక్ట్ నుంచి సాగునీరు విడుదల

వార్త 1 month ago

Devarakadra MLA Madhusudhan Reddy: రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతు దేశానికి వెన్నెముక అని, అన్నదాతలు అభివృద్ధి చెందితేనే దేశం సుభిక్షంగా ఉంటుందని దేవరకద్ర శాసనసభ్యులు జి.

మధుసూదన్ రెడ్డి (GMR) స్పష్టం చేశారు. వానాకాలం పంటల సాగును దృష్టిలో ఉంచుకుని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టు పరిధిలోని కాలువలకు ఆయన లాంఛనంగా సాగునీటిని విడుదల చేశారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సాగునీరు విడుదల కావడంతో హర్షం వ్యక్తం చేసిన ఆయకట్టు రైతాంగం.. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో పాటు నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రిజర్వాయర్‌లో 0.9 టీఎంసీల నీటి లభ్యత

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం కోయిల్‌సాగర్ రిజర్వాయర్‌లో 0.9 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని వివరించారు. ఇందులో తాగునీటి అవసరాల నిమిత్తం 0.6 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాల్సి ఉంటుందన్నారు. సాధారణంగా కాలువలకు పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేయాలంటే కనీసం 1.5 టీఎంసీల నీరు అవసరమని, అయినప్పటికీ రైతుల ఇబ్బందులను గుర్తించి బోర్లు రీఛార్జ్ అయ్యేందుకు మరియు ఆయకట్టు పరిధిలోని చెరువులను నింపేందుకు మొదటి విడతగా నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

Devarakadra MLA Madhusudhan Reddy: ఆరుతడి పంటల వైపే మొగ్గు చూపాలి

నీరు విడుదలవుతోందనే ఉత్సాహంతో రైతులు కొత్తగా వరి నారుమళ్లు, తూకాలు వేయవద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకుని రైతులు తప్పనిసరిగా ఆరుతడి పంటల సాగు వైపే మొగ్గు చూపాలని సూచించారు. అందుబాటులో ఉన్న ప్రతి నీటి బొట్టును పొదుపుగా వాడుకుంటూ భూగర్భ జలాలను పెంచుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో దేవరకద్ర మండల అధ్యక్షుడు అంజిల్ రెడ్డి, కౌకుంట్ల మండల అధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దమయంతి గోవర్ధన్ రెడ్డి, వైస్ చైర్మన్ యుగంధర్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ హర్షద్ అలీ, స్థానిక నాయకులు, కోయిల్‌సాగర్ గ్రామ ప్రజలు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నా

Epaper: epaper.vaartha.com

హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. కోకాపేట్‌లో భారీ బందోబస్తు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha