Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
క్రైమ్ థ్రిల్లర్ 'హయగ్రీవ' మూవీ రివ్యూ!

క్రైమ్ థ్రిల్లర్ 'హయగ్రీవ' మూవీ రివ్యూ!

వార్త 3 weeks ago

Hayagreeva Movie: కన్నడ యంగ్ హీరో ధన్వీర కథానాయకుడిగా, రఘు కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'హయగ్రీవ'. ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, మే 22వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.

ప్రస్తుతం ఈ సినిమా కన్నడ ఆడియోలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. విభిన్నమైన కథాంశంతో వచ్చిన ఈ సైకో థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలో చూద్దాం.

Read Also : Seducer Movie: ఓటీటీలోకి వచ్చిన బోల్డ్ హారర్ థ్రిల్లర్ 'సెడ్యూసర్'

 Hayagreeva Movie: Crime thriller ‘Hayagreeva’ movie review!

కథ

బెంగళూరు క్రైమ్ బ్రాంచ్‌లో అత్యంత సమర్థుడైన పోలీస్ ఆఫీసర్‌గా అర్జున్ హయగ్రీవ (ధన్వీర) పనిచేస్తుంటాడు. అతని భార్య ఐశ్వర్య (సంజనా ఆనంద్) ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో డాక్టర్‌గా ఉంటుంది. పెళ్లి తర్వాత అర్జున్ తన వృత్తిపరమైన బాధ్యతలతో తీవ్ర బిజీగా మారిపోతాడు. అదే సమయంలో సిటీలో వరుసగా ఘోర హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ శవాలు లభిస్తున్న తీరు పోలీసులను సైతం తీవ్రంగా కలవరపెడుతుంది. హంతకుడు మనుషుల దేహానికి ఉన్న తలలను నరికేసి, వాటి స్థానంలో మృగాల, జంతువుల తలలను అమర్చుతుంటాడు. ఈ దారుణాలను చూసి నగర ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు.

నగరంలో జరుగుతున్న ఈ వింత హత్యలన్నీ ఒకే సైకో కిల్లర్ చేస్తున్నాడని హయగ్రీవ గుర్తించాడు. శస్త్రచికిత్స చేస్తున్న విధానాన్ని బట్టి హంతకుడికి వైద్య శాస్త్రం పై మంచి అవగాహన ఉందనే విషయం పోలీసులకు అర్థమవుతుంది. అయితే ఆ సైకో కిల్లర్ ఎందుకు ఈ దారుణాలకు ఒడిగడుతున్నాడు? మనిషి మొండానికి జంతువుల తలలను ఎందుకు తగిలిస్తున్నాడు? ఎలాంటి ఆధారాలు దొరకకుండా తప్పించుకుంటున్న ఆ హంతకుడిని పట్టుకోవడానికి హయగ్రీవ వేసిన వ్యూహం ఏంటి? చివరికి ఆ సైకో పట్టుబడ్డాడా లేదా? అనేదే మిగతా కథ.

విశ్లేషణ

పిల్లలు ఎదుగుతున్నప్పుడే వారి ప్రవర్తనను తల్లిదండ్రులు గమనించాలనే ఒక మంచి సామాజిక సందేశాన్ని బేస్ చేసుకుని దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు. ధైర్యవంతుడైన ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌కు, భయమనేదే తెలియని ఒక ‘సైకో పాత్’కు మధ్య జరిగే మైండ్ గేమ్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

నటన

పోలీస్ ఆఫీసర్‌గా ధన్వీర నటన బాగుంది. సైకో పాత్ర పోషించిన నటుడు కూడా పర్వాలేదనిపించాడు. కథను పురాణాలతో లింక్ చేస్తూ మనుషులకు జంతువుల తలలు పెట్టే కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. గిరీశ్ గౌడా ఫొటోగ్రఫీ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా బాగుంది. జుదా శాండీ నేపథ్య సంగీతం కొన్ని సీన్లను ఎలివేట్ చేసింది. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా.. కథనం మాత్రం పాత పద్ధతిలోనే సాగింది. సైకో హత్యలు చేసే సీన్లు చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. ఇలాంటి థ్రిల్లర్ సినిమాల్లో హంతకుడు ఎవరో చివరి వరకు సస్పెన్స్‌గా ఉంచాలి. కానీ దర్శకుడు ముందే హింట్ ఇవ్వడంతో ఆ ఇంపాక్ట్ పోయింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్లు చాలా తాపీగా సాగుతాయి. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌లో కూడా కథనం వేగం పుంజుకోలేదు. ఒక వ్యక్తి సైకోగా మారడానికి చూపించిన ఫ్లాష్‌బ్యాక్ అంత బలంగా లేదు. పోస్టుమార్టం టేబుల్ పై తలలేని మొండాలను క్లోజప్‌లో చూపించడం సాధారణ ప్రేక్షకులను కాస్త ఇబ్బంది పెడుతుంది. హీరోయిన్ సంజనా ఆనంద్‌కు పెద్దగా నటించే స్కోప్ దక్కలేదు.

ముగింపు

గతంలో వచ్చిన సైకో కిల్లర్ సినిమాల తరహాలోనే ‘హయగ్రీవ’ కూడా సాగుతుంది. రొటీన్ కథను, రొటీన్ పద్ధతిలోనే తెరకెక్కించారు. పురాణాల లింక్ కొత్తగా ఉన్నా దాన్ని సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయారు. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు బాగా ఇష్టపడే వారు, ఎలాంటి అంచనాలు లేకుండా అమెజాన్ ప్రైమ్‌లో ఒకసారి ఈ కన్నడ చిత్రాన్ని ప్రయత్నించవచ్చు.

'సీతా పయనం' కలెక్షన్లపై అబద్ధపు ప్రచారం చేయను.. అర్జున్ సర్జా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha