Khairtabad Ganesh immersion:ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం, హైదరాబాద్ నగరంలో బడా గణేశుడి శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగి, క్రేన్ నంబర్ నాలుగు వద్దకు చేరుకుంది.
భక్తుల జై బోలో గణేష్ మహారాజ్ కీ జై నినాదాలతో హుస్సేన్ సాగర్ తీరం మార్మోగింది. అసాధారణ భద్రత నడుమ యావత్ అధికార యంత్రాంగం ఈ మహాఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.
Reada also: Metro Timing: నిమజ్జనాల వేళ మెట్రో సేవలు పొడిగింపు
Khairatabad Ganesh Immersion Live Updates
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
గణేశ్ నిమజ్జన వేడుకల కోసం ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. నిరంతరం డ్రోన్ల సహాయంతో భద్రతను పర్యవేక్షించారు. బల్దియా సిబ్బంది ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగిస్తూ పారిశుద్ధ్య పనులను సమర్థవంతంగా నిర్వహించారు.
Khairtabad Ganesh immersion:గంగమ్మ ఒడికి చేరిన బడా గణేష్
అరవై తొమ్మిది అడుగుల ఎత్తు ఉన్న ఖైరతాబాద్ బడా గణేశుడిని గంగమ్మ ఒడికి చేర్చే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. హుస్సేన్ సాగర్ తీరం వద్ద ప్రత్యేక క్రేన్లను సిద్ధం చేశారు. భక్తుల కన్నీటి వీడ్కోలు మధ్య మహా వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో పూర్తయింది.
Epaper: epaper.vaartha.com

