Mulugu Road Accident: ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలోని తాడ్వాయి-పస్రా రహదారిపై శుక్రవారం భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. వరంగల్ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న ప్రయాణికుల బస్సును, భద్రాచలం నుంచి మల్లంపల్లి రామచంద్రపూర్ వెళ్తున్న బొలెరో వాహనం ఎదురుగా వచ్చి అత్యంత వేగంగా ఢీకొట్టింది.
ఈ ఘటనతో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా, బస్సులో ప్రయాణిస్తున్న వారితో పాటు బొలెరోలోని వారు కలిపి 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
Read Also : Ganesh nimajanam: నిమజ్జనం వేళ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
Bus-Bolero collision in Mulugu district… 15 people seriously injured.
Mulugu Road Accident: ఘటనా స్థలానికి పోలీసులు.. క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు, 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలతో రోదిస్తున్న క్షతగాత్రులను 108 అంబులెన్స్‌ల ద్వారా చికిత్స నిమిత్తం ములుగు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే తాడ్వాయి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతివేగమే ప్రమాదానికి కారణమా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
గణేష్ నిమజ్జన శోభాయాత్రలో విషాదం.. ట్రక్ కింద పడి యువకుడు మృతి!

