Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
క్రికెట్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన ఐఐటీ విద్యార్థి

క్రికెట్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన ఐఐటీ విద్యార్థి

వార్త 2 weeks ago

IIT Patna : బీహార్‌లోని పాట్నా ఐఐటీ క్యాంపస్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.

క్యాంపస్‌లో క్రికెట్ ఆడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని తాకడంతో ఈ దుర్ఘటన జరిగింది.

మృతుడిని హైదరాబాద్ నగరంలోని చందానగర్‌కు చెందిన హర్షిత్ రాజ్‌గా గుర్తించారు. ఈరోజు ఉదయం ఆరు గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఐఐటీ పాట్నా సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ దీపక్ కుమార్ చౌరాసియా స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసుల వివరాల ప్రకారం.. హర్షిత్ రాజ్ తన స్నేహితులతో కలిసి క్యాంపస్‌లో క్రికెట్ ఆడుతున్న సమయంలో బంతిని అందుకునే క్రమంలో సమీపంలోని స్తంభాన్ని తాకాడు. ఆ సమయంలో విద్యుత్ ప్రవాహం ఉండటంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

Read Also:Vijay TVK CM Convoy: ముఖ్యమంత్రి స్థాయి ప్రోటోకాల్‌ను తిరస్కరించిన విజయ్?

 IIT Patna

అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. (IIT Patna) ఈ ఘటనతో క్యాంపస్‌లో విషాద వాతావరణం నెలకొంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు కూడా ఐఐటీ అధికారులు సమాచారం అందించారు. హర్షిత్ రాజ్ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha