Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్‌కు మద్దతుపై కాంగ్రెస్ క్లారిటీ.. ఎంపీ కీలక వ్యాఖ్యలు

విజయ్‌కు మద్దతుపై కాంగ్రెస్ క్లారిటీ.. ఎంపీ కీలక వ్యాఖ్యలు

వార్త 3 months ago

TVK Vijay : తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు అంశం చుట్టూ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై వస్తున్న విమర్శలకు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ ఘాటుగా స్పందించారు.

టీవీకే మొదటి నుంచి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతోందని, అందుకే తమ పార్టీ ఆ పార్టీకి మద్దతు ఇచ్చిందని స్పష్టం చేశారు.

స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావడం, ప్రజల తీర్పును గౌరవించడం, దక్షిణాదిలో ఎన్డీయే కూటమిని అధికారానికి దూరంగా ఉంచడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే టీవీకేకు కాంగ్రెస్ అండగా నిలిచిందని చెప్పారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు స్టాలిన్‌తో కూడా మాట్లాడినట్లు మాణికం ఠాకూర్ వెల్లడించారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీపై వచ్చిన ఆరోపణలను కూడా కాంగ్రెస్ తీవ్రంగా తీసుకుందని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు డీఎంకే అనుకూల మీడియా కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కూడా పరోక్షంగా ఎన్డీయేకు సహకరిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

Read Also:Vijay TVK CM Convoy: ముఖ్యమంత్రి స్థాయి ప్రోటోకాల్‌ను తిరస్కరించిన విజయ్?

 TVK Vijay

తమిళనాడులో ఎన్డీయే అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం కోసం రాజకీయంగా సరైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. టీవీకేకు మద్దతు ఇవ్వడం వల్ల ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. టీవీకేకు మద్దతిచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని మాణికం ఠాకూర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ పరిణామాల మధ్య ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఖర్గే షూలను చేతితో పక్కకు జరిపిన రాహుల్ గాంధీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha