Revanth Reddy Review On Irrigation Department : కృష్ణా నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ (KWDT-2) ఎదుట తెలంగాణ నీటి అవసరాలకు అనుగుణంగా గట్టి వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి ఎ.
రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ న్యాయవాదులు, అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read Also: India To Provide Quality : అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
Revanth Reddy Review On Irrigation Department
జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల ఆధారంగా ప్రాజెక్టుల వారీగా తెలంగాణకు గరిష్ఠ వాటా సాధించేందుకు ప్రాధాన్యమివ్వాలని సీఎం సూచించారు. జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే కేఆర్‌ఎమ్‌బీ (KRMB) మనుగడ ప్రశ్నార్థకమవుతుందని, కేవలం పర్యవేక్షణ బోర్డు మాత్రమే మిగులుతుందని సమావేశంలో చర్చించారు. సరైన గ్యారంటీలు లభించకుండా ఈ తీర్పునకు అంగీకరించరాదని హెచ్చరించారు. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండి ప్రవహిస్తేనే వరద నీరుగా పరిగణించాలి. ప్రాజెక్టులలోకి వరద రాకుండానే ఆంధ్రప్రదేశ్ మల్యాల, ముచ్చుమర్రి నుంచి నీటిని మళ్లించడం వల్ల తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతింటోందని, దీనికి సంబంధించి ఏపీ నుంచి పరిహారం కోరే అంశాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.
Revanth Reddy Review On Irrigation Department : సీఎం దిశా నిర్దేశం
పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించడం వల్ల కృష్ణా ఎగువ రాష్ట్రాలకు దక్కే నీటిలో తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీల నీటిని పొందేలా బలమైన ఆధారాలు చూపాలని కోరారు. మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి లాంటి వెనుకబడిన, ఫ్లోరైడ్ మరియు కరువు ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలను క్షేత్రస్థాయి ఆధారాలతో ట్రిబ్యునల్‌కు వివరించాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. ప్రాజెక్టుల్లోకి ఎటువంటి వరద లేకుండానే ఏపీ ప్రభుత్వం నీటిని మళ్లించినపుడు కోల్పోయే విద్యుత్తుకు పరిహారం కోరే అంశాన్ని, దీనిని ట్రైబ్యునల్ దృష్టికి తీసుకెళ్లడం గురించి ఆలోచించాలని లాయర్ల టీమ్‌కు, ఇంజినీర్లకు సీఎం సూచించినట్లు సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. 2014 కంటే ముందు మంజూరైన ప్రాజెక్టుల వివరాలన్నీ శరవేగంగా తయారు చేయాలని ఇంజినీర్లను సీఎం ఆదేశించారు.

