Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సెప్టెంబర్ 1 నుంచి నైట్ బస్ సర్వీసులు ప్రారంభం

సెప్టెంబర్ 1 నుంచి నైట్ బస్ సర్వీసులు ప్రారంభం

వార్త 3 weeks ago

TGSRTC: హైదరాబాద్ మహానగరంలో రాత్రి వేళల్లో ప్రయాణించే పౌరులు, ఐటీ ఉద్యోగులు, నైట్ షిఫ్ట్ సిబ్బంది సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది.

సెప్టెంబర్ 1 నుంచి నగరంలోని 6 ప్రధాన రూట్లలో నైట్ బస్ సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. రాత్రి 10:00 గంటల నుంచి ఉదయం 5:00 గంటల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి.

ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు మహాలక్ష్మి పథకం కింద ఈ నైట్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లకు ఆలస్యంగా చేరుకునే దూరప్రాంత ప్రయాణికులతో పాటు హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఐటీ కారిడార్లలో రాత్రి వేళల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ నిర్ణయం ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రతి 30 నిమిషాల నుంచి గంటకు ఒక బస్సు చొప్పున సర్వీసులను నడపనున్నారు.

Read Also : Police Arrested Drugs Gang : కరీంనగర్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు: బీటెక్, డిగ్రీ విద్యార్థుల సహా 9 మంది అరెస్ట్

 Night bus services to start from September 1.

TGSRTC: నైట్ బస్ రూట్లు, సర్వీసుల వివరాలు ఇలా..

  • బస్సు నంబర్ 10H (సికింద్రాబాద్  కొండాపూర్): సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ మీదుగా కొండాపూర్ వరకు ఈ బస్సులు తిరుగుతాయి. రాత్రి వేళల్లో ప్రతి 30 నిమిషాల నుంచి గంటకు ఒక సర్వీస్ చొప్పున మొత్తం 8 నుంచి 10 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
  • బస్సు నంబర్ 195W (బాచుపల్లి వేవ్‌రాక్): బాచుపల్లి నుంచి రాయదుర్గం, గచ్చిబౌలి మీదుగా వేవ్‌రాక్ వరకు నడిచే ఈ బస్సు ఐటీ ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి గంటకు ఒక సర్వీస్ నడుస్తుంది.
  • బస్సు నంబర్ 290U (సికింద్రాబాద్ హయత్‌నగర్): రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ ఎదురుగా ప్రారంభమై ఎల్బీనగర్, వనస్థలిపురం, ఎన్జీఓస్ కాలనీ మీదుగా హయత్‌నగర్ చేరుకుంటుంది.
  • బస్సు నంబర్ 218 (కోఠి పటాన్‌చెరు): కోఠి, అబిడ్స్ పరిసర ప్రాంతాల నుంచి పటాన్‌చెరు వరకు ఈ నైట్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.
  • బస్సు నంబర్ 222A (కోఠి పటాన్‌చెరు): కోఠి నుండి హైటెక్ సిటీ మీదుగా పటాన్‌చెరు వరకు అత్యధిక రద్దీ ఉండే ఈ రూట్‌లో ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ప్రతి 30 నుండి 60 నిమిషాలకు ఒక బస్సు నడుస్తుంది.
  • బస్సు నంబర్ 219 (సికింద్రాబాద్ పటాన్‌చెరు): సికింద్రాబాద్ నుంచి పటాన్‌చెరు మార్గంలో నైట్ సర్వీస్ నిర్వహణకై అధికారులు ఇప్పటికే మార్గాన్ని పరిశీలించారు.

ఈ నైట్ సర్వీసుల వల్ల అర్ధరాత్రి వేళల్లో ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించి అధిక ఛార్జీలు చెల్లించే భారం ప్రయాణికులకు తగ్గనుంది.

హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ సేవల్లో అంతరాయం.. ప్రయాణికులకు ఇబ్బందులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha