Krishna River Barrage: తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో కృష్ణా నదిపై భారీ ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. జూరాల ప్రాజెక్టుకు ఎగువన, ఇరు రాష్ట్రాలకు ఉపయోగ పడేలా ఒక సరికొత్త బ్యారేజీ కమ్ బ్రిడ్జ్ (వంతెనతో కూడిన బ్యారేజీ) నిర్మించాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు యోచిస్తున్నాయి.
తెలంగాణలోని నారాయణపేట జిల్లా మఖ్తల్ నియోజకవర్గ పరిధిలోని కొల్లాపూర్, కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కోరకుంట గ్రామాల మధ్య ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ బ్యారేజీ నిర్మాణానికి దాదాపు రూ.500 కోట్లు ఖర్చవుతుందని సాగునీటి రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 2 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చని తెలుస్తోంది. ఈ బ్యారేజీ అందుబాటులోకి వస్తే మఖ్తల్ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తాగునీరు, సాగునీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది.
Read also: secunderabad crime: చికిత్స పొందుతూ తప్పంచుకున్న రిమాండ్ ఖైదీ
Krishna River new barrage bridge
Krishna River Barrage: సాగునీటితో పాటు మెరుగైన రవాణా
ఈ బ్యారేజీ కేవలం నీటిని నిల్వ చేసే బ్యారేజీ మాత్రమే కాకుండా వంతెనను కూడా నిర్మించనున్నారు. దాంతో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ మరింత సులువు కానుంది. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల సరిహద్దు దాటడానికి పడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా ప్రయాణ సమయం కూడా చాలా వరకు కలిసివస్తుంది. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, కర్ణాటక నీటిపారుదలశాఖ మంత్రి బోసరాజు ఇప్పటికే ప్రత్యేకంగా భేటీ అయి ప్రాథమిక చర్చలు జరిపారు. ప్రాజెక్టు సాధ్యా సాధ్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఇరు రాష్ట్రాల ఇంజనీర్లతో కూడిన జాయింట్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ఉమ్మడి కమిటీ ఇచ్చే సాంకేతిక నివేదిక ఆధారంగా ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు త్వరలోనే ఒక తుది నిర్ణయానికి రానున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

