Artificial intelligence: పారిశ్రామిక విప్లవం నుండి ఐటీ రంగం వరకు జరి గినవన్నీ సాంకేతిక విప్లవాలు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నూతన నాగరికత కూడా ప్రపంచ దేశాల దిశ, దశ మార్చ బోయే శక్తిగా ఉన్నది.
ఇప్పటివరకు ఐటీ రంగంలో ప్రపంచ దేశాలకు వెన్నెముకగా ఉన్న మన నిపుణులు ఇప్పుడు ఏఐ రంగంను కూడా నడిపించగలగాలి.
ఆనాడు ఐఐటీలను స్థాపిం చగలిగినందువల్లనే నేడు ఐటీ దిగ్గజ కంపెనీలకు సీఈవోలు గా మనవారు ఉన్నారు. ఈపునాదుల పైననే ఏఐ రంగాన్ని కూడా మనం శాసించగలగాలి. లేకపోతే అమెరికా చైనా ఆధిపత్య ధోరణలను అరికట్టలేం. ఏఐ ప్రపంచంలో మను గడ సాగించేందుకు అత్యవసరమైన వివిధ రకాల నైపుణ్యా లను విద్యార్థులు ఒంటబట్టించుకునే విధంగా దేశంలోని విద్యా వ్యవస్థలను తీర్చిదిద్దాలి. ప్రపంచ దేశాలకు మార్గ దర్శకంగా మనమే ముందుండాలి. మనకు కావలసినంత డెమోగ్రాఫిక్ డివిడెంట్ సాంకేతిక నిపుణత మన దేశానికి ఉంది. కావలసినదల్లా ప్రభుత్వ పాలన సహాయ సహకా రాలు మాత్రమే. మన ప్రధాని ఏఐ రంగాన్ని దేశ భవిష్య త్తు కోసం ఉపయోగించాలని ఇది మానవ కేంద్రీకృతంగాను సమ్మిళిత అభివృద్ధి గాను ఉండాలని ఢిల్లీలో జరిగిన ఏఐ ప్రభావం అనే సదస్సులో నొక్కిచెప్పారు.
Read Also : Puducherry Elections: చీరకట్టులో ఓటర్లకు స్వాగతం పలుకుతున్న రోబో నీలా!
artificial intelligence
artificial intelligence: సామాజిక విలువలకు అనుగుణంగా
కృత్రిమ మేధస్సు పరిశోధనా రంగంగా ప్రారంభమై, ఇప్పుడు ప్రభుత్వం, పరి శ్రమలు, ప్రజల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే ప్రాథ మిక సాంకేతికతగా వేగంగా అభివృద్ధి చెందింది. ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ, విద్య, భద్రత ప్రజావిధానాలు వంటి కీలక రంగాల్లో ఏఐ ఆధారిత వ్యవస్థలు కీలక నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధ్యతాయుత అభి వృద్ధి, పరిపాలన అత్యంత అవసరంగా మారింది. ఏఐ సాంకేతికత వినియోగమూ బాధ్యతాయుతంగానే ఉండాలి. బాధ్యతాయుత ఏఐ అనేది నైతికత, పారదర్శకత, సామా జిక విలువలకు అనుగుణంగా రూపకల్పన చేసి అమలు చేయాల్సిన ఒక సాంకేతిక వ్యవస్థ ప్రజాప్రయోజనాలకు హాని లేకుండా, పక్షపాతాన్ని తగ్గించే, గోప్యతను రక్షించే సమానత్వం, భద్రతను ప్రోత్సహించే విధంగా ఏఐ వ్యవ స్థలను అభివృద్ధి చేయడం, ఉపయోగించడం లక్ష్యంగా ఉండాలి. ఇది కేవలం సాంకేతిక పనితీరుకే పరిమితం కాకుండా, సమాజంపై విస్తృత ప్రభావం, చట్టపరమైన అనుసరణ, నైతిక సమన్వయాన్ని కూడా కలిగి ఉండాలి. ప్రధానంగా న్యాయం, మానవ హక్కులు వంటి నైతిక అంశా లపై దృష్టిపెట్టాలి. బాధ్యతాయుత ఏఐ అనేది నైతికత, ప్రమాద నియంత్రణ, అనుసరణ, కార్యాచరణ బాధ్యతలను సమగ్రంగా కలిగిన పరిపాలనా నమూనా. ఇదంతా ప్రభు త్వ నియంత్రణలోనే జరగాలి. పలువురు దేశాధినేతలతో అంతర్జాతీయ స్థాయి ఏఐ సారథులు, సీఈఓలు విద్యా వేత్తలు, పరిశోధకులు, దాతలు సదస్సులో పాల్గొన్నారు.
టెక్నాలజీపై పెట్టు బడులను పెంచాలి
ఏఐ రంగంలో భారతన్నుసారథ్య స్థానంలో నిలిపే లక్ష్య సాధనలో భాగంగా ఈ సదస్సును కేంద్రం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంతోనే ఏఐ రంగాన్ని ఆనాటి ఐఐటీ లాగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యను కూడా పరిగణలోకి తీసుకోవా ల్సి ఉన్నది. అభివృద్ధి చెందుతున్న ఏఐ ద్వారా నిరుద్యోగ సమస్య ఏర్పడకూడదు. మనప్రభుత్వ పెట్టుబడులు మాత్రం ఓ మోస్తరుగానే ఉన్నాయి. గత ఏడాది రూ.2,000 కోట్లు కేటాయిస్తే, తాజా బడ్జెట్ ప్రతిపాదనల్లో అవి అందులో సగానికి తగ్గిపోయాయి. అత్యధునాతన టెక్నాలజీపై పెట్టు బడులను పెంచాల్సిన అవసరం ఉన్న సమయంలో కోత పెట్టడం నివ్వెరపరుస్తోంది. ఏఐ ప్రవేశం వలన మన దేశం లో 15 లక్షల ఉద్యోగాలు పోతాయని నీతి అయోగ్ అంచనా వేసింది. దశాబ్దాలుగాసాగుతున్న సాంకేతిక అభివృద్ధినేడు పరాకాష్టకు చేరింది. మానవ శారీరక శ్రమను రోబోలు ఆక్ర మిస్తుంటే, మేధా శ్రమ స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కైవసం చేసుకుంటోంది. ఫలితంగా బ్లూ కాలర్, వైట్ కాలర్ రంగాల్లో మనిషికి స్థానం లేకుండా పోతోంది. ఉదా హరణకు, ఒక సంస్థలో 30వేలమంది వరకూ ఉద్యోగులను తొలగించనున్నారు. దీనికి కారణం ఆ కంపెనీ ఒక ఉద్యోగ స్టుడికి సాలీనా సగటున 36వేల డాలర్ల వేతనం చెల్లించ వలసి ఉంటే అదే స్థానంలో మర మనిషిని (రోబో) పెట్టు కుంటే అయ్యే ఖర్చు 3,600 డాలర్లు మాత్రమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనో తన సంస్థకు సంబంధించిన కొత్త కోడ్ను గూగుల్ 2025 నాటికి 30 మేరకు రాయగలుగు తోంది. అంటే, ఆ మేరకు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల కోతలు అని వార్యమన్నమాట. వేలాది మంది ఉద్యోగుల తొలగింపులు సాఫ్ట్వేర్ రంగంలో పెను సంచలనాన్ని సృష్టి స్తున్నాయి.
నైపుణ్యాన్ని పెంచుకోవడం
ఈ భారీ లేఆఫ్స్ వెనుక రాజకీయ కారణాల కంటే కూడా కృత్రిమ మేధస్సు రంగంలో ఆధిపత్యం సాధిం చాలనే కంపెనీ వ్యూహాత్మక నిర్ణయమే ప్రధానంగా కనిపి స్తోంది. దాదాపు ముప్ఫై వేలమంది వరకు, అంటే సంస్థ లోని మొత్తం సిబ్బందిలో సుమారు పద్దెనిమిది శాతం మందిని తొలగించాలని ఓ సంస్థ నిర్ణయించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏఐ మౌలిక సదుపాయాల కోసం భారీగా నిధులను మళ్లించడమే. కంపెనీ ఆదాయం బలంగఉన్నప్పటికీ, భవిష్యత్తులో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రత్యర్థులతో పోటీ పడాలంటే ఏఐ డేటా సెంటర్ల నిర్మాణం అత్యవసరమని యాజమాన్యం భావిస్తోంది. ఇందు కోసం వెచ్చించాల్సిన వేల కోట్ల నిధులను సమకూర్చుకోవ డానికి మానవ వనరుల ఖర్చును తగ్గించుకోవడం తప్పని సరి అని కంపెనీ భావించడం వల్లనే ఈ అకస్మాత్తు తొల గింపులు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగం ఇప్పటికే ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటున్న తరుణం లో, ఇలాంటి దిగ్గజ సంస్థలు తీసుకుంటున్న నిర్ణయాలు ఉద్యోగులలో తీవ్ర ఆందోళననునింపుతున్నాయి. ఈ అని శ్చిత పరిస్థితుల మధ్య ఉద్యోగులు తమ ఉనికిని కాపాడుకో వాలంటే కేవలం పాతతరం సాఫ్ట్వేర్ నైపుణ్యాలపై ఆధార పడటం సరిపోదు. ఏఐ విప్లవం వల్ల వస్తున్న మార్పులను గమనిస్తూ, కొత్త సాంకేతికతలలో నైపుణ్యాన్ని పెంచుకోవ డం ఒక్కటే ప్రస్తుతానికి కనిపిస్తున్న పరిష్కారం.
artificial intelligence
పెరిగిన నిరుద్యోగ సమస్య
సంస్థలు లాభాలకోసం మనుషుల కంటే యంత్రాలకే ఎక్కువ విలువ ఇస్తున్న ఈ రోజుల్లో, సాఫ్ట్వేర్ ఉద్యోగులు నిరంతరం తమ ను తాము అప్డేట్ చేసుకోవడం ద్వారా మాత్రమే ఈ ఉపాధి గండం నుండి బయటపడగలరు. మనిషితో పని లేకుండా ఉత్పత్తుల నుండి యుద్ధరంగం వరకు ఏఐ తోనే నిర్వహించుకుంటే నిరుద్యోగ సమస్య ఎక్కువ అవుతుందని పాలకులు పెట్టుబడిదారులు గమనించాలి. ఆధునికయుగం లో ఎప్పటికప్పుడు సాంకేతికత అభివృద్ధి చెందుతూ వస్తుం ది. ఆ సాంకేతికత వల్ల మానవాళి శ్రేయస్సుకు మేలు జర గాలి. వారికి కీడు జరిగే అవకాశాలుంటే ప్రభుత్వం నివారిం చాలి. పారిశ్రామిక విప్లవం నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వరకు సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందు తూ వాటిని ఉపయోగించడం వలన వివిధ దేశాల ఆదా యాలు పెరిగిన మాట వాస్తవమే కానీ దీనితో పాటు నిరుద్యోగ సమస్య కూడా గణనీయంగా పెరిగింది. లాభాపేక్ష, ఖర్చులు తగ్గింపు నెపంతో కార్పొరేట్ సంస్థలు ముఖ్యంగా సాఫ్ట్ వేర్ రంగం లేఆప్ల మంత్రం జపిస్తోంది. ఇది మౌళికంగా మానవ శ్రేయస్సుకు విరుద్ధం.
-డాక్టర్ ఎనుగొండ నాగరాజ నాయుడు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

