Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
క్షయ ముక్తభారతే పైచేయి?

క్షయ ముక్తభారతే పైచేయి?

వార్త 1 week ago

Tuberculosis : ఈ దేశంలో అంటు, సొంటు లేని వ్యాధులేవన్నా ఉన్నా యంటే వాటిని వేళ్లమీద లెక్కించుకోవాల్సిందే. అనా దిగా అంటువ్యాధిగా తారసపడ్తున్న వ్యాధి ఏదైనా ఉంటే అది 'క్షయ' వ్యాధి.

ఈ మధ్యనే ‘ప్లేగ్’ వ్యాధి కూడా తిరు గుటపాలో వచ్చేసిందన్న వార్తలు వచ్చేసాయి. ఒకప్పుడు ఈ వ్యాధులు సోకి భారతీయుల ప్రాణాలను క బళించేసా యనే చరిత్ర ఉంది. అందుకే క్షయ వ్యాధి మళ్లీ ప్రబలు తోందంటే భారతీయులు తమ శ్వాసకోశ రక్షణకు ఎంతో ఆందోళన చెందుతున్నారు. టి.బి అత్యంత ప్రమాదకరం. ప్రాణాంతక వ్యాధిగా భయంతో చెప్పుకునే వ్యాధి. దేశీ యుల ఆరోగ్యాన్ని, ఆర్ధిక వ్యవస్థను శతాబ్దాలుగా వేధి స్తున్న వ్యాధుల్లో ఒకటిగా క్షయవ్యాధినే చెబుతుంటాము. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ప్రపంచదేశాలు 2030 నాటికి క్షయ వ్యాధిని తరిమి కొట్టా లన్నది ప్రధానంగా గోచరిస్తుంది. కాగా భారత్ మాత్రం ఈ లక్ష్యసాధనలో ముందడుగు వేసే దిశగా పరుగులుతీస్తోంది. ఇప్పుడు ‘ప్రధాన మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ అనే ఆలోచనను ఒక ప్రత్యేక ఆరోగ్య పథకంగా చేపట్టింది. కేవలం ఆసుపత్రుల ద్వారా రోగులకు మందులు చేయడ మొక్కటే ఈ వ్యాధి నయానికి సరిపోదని ఎంచి ప్రత్యే కించి దీన్నొక సామాజిక ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకువెళ్లా లనే ధ్యేయంతో ఉంది. ముందుగా ప్రజల భాగస్వామ్యం అత్యంత ఆవశ్యకమని భావించింది.

 Tuberculosis

Tuberculosis : పొగాకు ఉత్పత్తులతో..

కార్పొరేట్ సంస్థలు, ప్రజాప్రతినిధులు, సామాన్య పౌరులు ‘ని-క్షయ మిత్ర’గా నమోదు చేసుకొని, టిబి రోగులను కూడా దత్తత తీసు కుంటారు. అనగా వారికి వైద్యసేవలు, చికిత్సలు అందిం చడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వారిని జతచేస్తారు. ఇవి గాక ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, ఆధ్వర్యంలో నేషనల్ టిబి ఎలిమినేషన్ ప్రోగ్రాం కార్యక్రమాలను కేంద్రప్రభుత్వం శ్రద్ధాసక్తులతో క్షయనివారణ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అయినా సత్ఫలితాలు పొందే విషయంలో పూర్తిస్థాయి విశ్లేషణలు జరిపినప్పుడు మన ప్రభుత్వాల వైఖరి భిన్నం గా అనిపిస్తోంది. ట్యుబర్క్యూలోసిస్ వ్యాధి విషయమే చెప్పాలంటే 2010లో అత్యధికంగా ఈ వ్యాధులు భారత్ లోనే 26 శాతం ఉన్నాయని అంచనా వేసారు. ప్రపంచం మొత్తం మీద ఐదు దేశాల్లో క్షయవ్యాధిగ్రస్తులు 55.9 శాతం ఉన్నారని గ్లోబల్ టిబి రిపోర్ట్ తెలియచేస్తోంది. దేశంలో 2010లో క్షయరోగానికి యేటా 5.8 లక్షలమంది బలవుతున్నారు. కాగా 2023లో 3.2 లక్షలకు మరణా లు తగ్గాయి. 2015-24లమధ్య భారత్లో 3.05 లక్షల మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడిస్తోంది. అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే క్షయవ్యాధి తగ్గుదలను సూచిస్తోంది. క్షయవ్యాధి నివారణ కు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా పూర్తిస్థాయి తగ్గించడం అసాధ్యంగా అనిపిస్తోంది. ప్రధానంగా పొగాకు ఉత్పత్తుల తో చుట్టా, బిడీ, సిగార్ వంటివి వాడడం వల్ల శరీరం కుళ్లిపోతోంది. ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధ, సమగ్ర సర్వేల ద్వారా క్షయ రోగగ్రస్తులను గుర్తించడమవు తోంది.

మామూలు మందులుకు లొంగని..

మామూలు మందులుకు లొంగని మల్టిడ్రగ్ రెసి స్టెంట్ టిబిని అదుపు చేయడం ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదు. ఈ వ్యాధిగ్రస్తులు ఔషధాలను తీసుకోవడం మధ్యలోనే ఆపివేయడం వలనో టిబి నిరోధకత కష్టమవు తోంది. పోషకాహార లోపం, నివాస రద్దీ వంటి అంశాల వలన గ్రామీణులకు ముప్పుగా పరిణమిస్తోంది. శ్రామిక వర్గాల్లో అవగాహనలేమి వల్ల మరికొంత మందిలో రోగ లక్షణాలు బయటపడుతున్నాయి. శరీరం మీద వేగవంత మయిన కొత్త వ్యాక్సిన్లతో తక్కువ వ్యవధిలోనే నయ మయ్యే విధంగా ఔష ధాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. టిబి ముక్త పంచాయతీల ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచే అనుమానిత రోగుల్ని గుర్తించి చికిత్సలను వారికి దగ్గర చేయాలి. కాగా కేంద్రప్రభుత్వం కోవిడ్ మహమ్మారి సోకిన సమయంలో అధిక నిధులు అటు మళ్లించడంతో ‘టిబి’ వ్యాధి నిరోధకత పట్ల శ్రద్ధ తగ్గించింది. నిధులు కూడా సరిపడినన్ని కేటాయించక పోవవడంతో క్షయవ్యాధి రోగులు పెరిగారని అంచనాలు వివరిస్తున్నాయి. 2023లో అంతకు ముందు కన్నా 38 శాతం నిధులు ఎక్కువగా కేటాయించినందున క్షయముక్త భారత్ ఊపందుకుంది. టిబి వ్యాధి సోకిన రోగులకు దూరంగా ఉండడం రోగులను గుర్తించిన వెంటనే వారికి సరైన చికిత్సలను అందించే కార్యాచరణకు ఉపక్రమించడం అవసరం. వ్యాధిగ్రస్తులకు సామాన్య ప్రజానీకం దూరంగా ఉండాలి. వారు దగ్గినా, తుమ్మినా వారికి సమీపంలో ఉన్నవారికి ఈ వ్యాధిసోకే అవకాశముంది.

 Tuberculosis

క్షయవ్యాధి సోకటం ఆందోళనకరం

ఇటీవలే పొగ తాగే వారికన్నా వారి నుంచి వచ్చే పొగ పీల్చేవారికే శ్వాస కోశ వ్యాధులు రాగలవని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరి కలు కూడా వెలువడ్డాయి. కనుక క్షయ కూడాశ్వాసకోశాన్ని మాలిన్యపరిచే వ్యాధి కనుక మానవాళి స్వయంగా జాగ్ర త్తలు తీసుకోవడం అవసరం. ఇతర దేశాల కన్నా భారత్ లో టిబి రోగుల నిష్పత్తి అధికంగా ఉన్నందున భారత్లో మరికొన్ని చికిత్సలు కూడా అవసరమయున్నది. 2023లో ప్రపంచవ్యాప్తంగా 10.8 మిలియన్ల కేసులున్నాయన్న సర్వేలు చెబుతుండగా ఆగ్నేయాసియాలోనే వీటి వ్యాప్తి ఎక్కువగా ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వ వైద్యచికిత్సా పథకాలను ప్రతి ఒక క్షయరోగి పొందాల్సి ఉంది. ఇండియా లో 2024లో టిబి కొత్త కేసుల అంచనా ప్రకారం లక్ష జనాభాకు 237 నుంచి 187కి తగ్గింది. 2015తో పోలిస్తే 21 శాతం తగ్గినట్లే. 2015 నుండి 2024ల మధ్య 27 లక్షలు కొత్త కేసులు నమోదయ్యాయి. ఒకవైపు వ్యాధి నియంత్రణలో పురోగతి కనపడుతున్నా కొత్తగా పలువురకు క్షయవ్యాధి సోకటం ఆందోళనకరం. వ్యాధి నిర్మూలన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడ మే ప్రధానంగా ఈ పథకం లక్ష్యశుద్ధితో అమలు కావాల్సి ఉంది. ఈ వ్యాధిని దాచుకోవాలని ఎవరైనా చూస్తే అది వారికే శాపంగా పరిణమించగలదు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

బతుకమ్మ స్పెషల్ నానబెట్టిన బియ్యం ప్రసాదం.. తయారీ విధానం ఇదే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha