Harish Rao's defamation suit : కాంగ్రెస్ నాయకులు బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్‌లపై బిఆర్‌ఎస్ ముఖ్యానేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో న్యాయపోరాటానికి దిగారు.
తనపై ఎలాంటి ప్రాతిపదిక లేకుండా క్షుద్రపూజల పేరుతో అసత్య ఆరోపణలు చేసి రాజకీయంగా తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు కుట్ర పన్నారంటూ నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు.
Praja palana Day: నేడు ప్రభుత్వ ప్రజాపాలన దినోత్సవం
Harish Rao’s defamation suit
Harish Rao’s defamation suit : క్షమాపణలు చెప్పకపోవడంతో కోర్టు మెట్లెక్కిన హరీశ్‌రావు:
తనపై చేసిన క్షుద్రపూజల వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, నిర్దిష్ట గడువులోగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని హరీశ్‌రావు గతంలోనే ఆ ఇద్దరు నేతలకు న్యాయపరమైన నోటీసులు (లీగల్ నోటీసులు) పంపించారు. అయితే, నిర్ణీత గడువు పూర్తయినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పాటు క్షమాపణలు చెప్పకపోవడంతో హరీశ్‌రావు తన న్యాయవాది ద్వారా నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు.రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ నేతలు తన వ్యక్తిత్వాన్ని హసనం చేసేలా నిరాధారమైన వ్యాఖ్యలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన పరువుకు భంగం కలిగించినందుకు వారిపై చట్టప్రకారం క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవాలని కోర్టును అభ్యర్థించారు.
తెలంగాణ లో కొత్త పెన్షన్లు కోసం ఎన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయంటే?

