Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కూకట్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి!

కూకట్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి!

వార్త 1 week ago

Kukatpally Road Accident: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంతో వచ్చిన టిప్పర్ లారీ స్కూటీని బలంగా ఢీకొట్టిన ఈ దుర్ఘటనలో ఇద్దరు టీనేజ్ యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Read Also:Nirmal Crime: సవతి కొడుకుతో అక్రమ సంబంధం, వద్దని పెళ్లికి సిద్ధపడితే సుపారీ ఇచ్చి హత్య!

క్రికెట్ ఆడేందుకు వెళ్తుండగా ప్రమాదం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్ (17), లక్ష్మీ తేజ (17) తమ మరొక స్నేహితుడితో కలిసి ఆదివారం ఉదయం ఒకే స్కూటీపై క్రికెట్ ఆడేందుకు బయలుదేరారు.కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ వీరి స్కూటీని తీవ్రస్థాయిలో ఢీకొట్టింది. ఈ దాటికి తలలకు తీవ్ర గాయాలు కావడంతో మహేశ్, లక్ష్మీ తేజ అక్కడక్కడే ప్రాణాలు కోల్పోయారు.స్కూటీపై ఉన్న మూడో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో, చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Kukatpally Road Accident: గాంధీ ఆస్పత్రికి మృతదేహాలు – టిప్పర్ డ్రైవర్ అదుపులోకి

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణమా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హృదయవిదారక ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదచ్ఛాయలు అలముకున్నాయి.

Epaper: epaper.vaartha.com

మణిపూర్ హింసాకాండ కేసుల కోసం ప్రత్యేక కోర్టుల ఏర్పాటును ప్రతిపాదించిన సుప్రీంకోర్టు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha