Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కుక్కల ఇంజెక్షన్‌తో బావను హత్య ..భయంతో నిందితుడు కుటుంబంతో సహా ఆత్మహత్య!

కుక్కల ఇంజెక్షన్‌తో బావను హత్య ..భయంతో నిందితుడు కుటుంబంతో సహా ఆత్మహత్య!

వార్త 3 weeks ago

Nellore Crime: నెల్లూరు జిల్లాలో తీవ్ర సంచలనం రేపిన అగ్రికల్చర్ ఆఫీసర్ (AO) శ్రీహరి హత్య కేసు విషాదాంతమైంది. ఆస్తి కోసం బావను అత్యంత దారుణంగా ఇంజెక్షన్ ఇచ్చి చంపిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హరికృష్ణ..

తన భార్య, ఇద్దరు అమాయక పిల్లలతో కలిసి సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులకు దొరికిపోతామనే భయంతో రైలు కింద పడి కుటుంబం మొత్తం ప్రాణాలు విడవడం స్థానికంగా కలకలం రేపుతోంది.

Read Also :Mancherial Crime: పెళ్లి చేసుకోవాలంటూ నరకం చూపించారు.. వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య

అసలేం జరిగిందంటే..?:

నెల్లూరు జిల్లాలో వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న శ్రీహరిని, అతని బావ అయిన హరికృష్ణ కొన్ని రోజుల క్రితం పథకం ప్రకారం కారులో తీసుకెళ్లాడు. కారులోనే శ్రీహరికి 'कुక్కలను చంపే ఇంజెక్షన్' (Lethal Injection) ఇచ్చి దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నటిస్తూ.. శ్రీహరి గుండెపోటుతో (Heart Attack) మరణించాడంటూ కుటుంబ సభ్యులను, బంధువులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే శ్రీహరి మరణంపై అనుమానం వచ్చిన అతని భార్య, ఆస్తి కోసమే తన తమ్ముడు హరికృష్ణ ఈ దారుణానికి ఒడిగట్టాడంటూ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ముమ్మరం చేయడంతో నిందితుడు హరికృష్ణ పరారయ్యాడు.

Nellore Crime:పోలీసుల భయంతో సామూహిక బలవన్మరణం

పోలీసులు తన కోసం గాలిస్తున్నారనే విషయం తెలియడం, కేసు నుంచి తప్పించుకోలేననే తీవ్ర మనస్తాపంతో హరికృష్ణ ఘోర నిర్ణయం తీసుకున్నాడు. పరారీలో ఉంటూనే తన భార్య, ఇద్దరు పిల్లలను తీసుకుని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. వేగంగా వస్తున్న రైలు కింద పడి నలుగురూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతుల్లో నిందితుడు హరికృష్ణ, అతని భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు రైల్వే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఒక హత్య కేసు చివరకు నలుగురి సామూహిక ఆత్మహత్యతో ముగియడం, అందులో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోవడంతో జిల్లాలో తీవ్ర విషాదం, సంచలనం నెలకొంది. రైల్వే పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

క్షణికావేశం..రైలు కింద పడి నలుగురు ఆత్మహత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha