Dailyhunt
కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా వైసిపి నేతల కుట్రలు

కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా వైసిపి నేతల కుట్రలు

వార్త 1 week ago

జువ్వలదిన్నె ప్రాజెక్టుపై వైసిపి నీచ రాజకీయానికి పాల్పడుతోంది : మంత్రులు కొల్లు రవీంద్ర, జనార్ధన్ రెడ్డి

AP Politics: రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తుంటే ఓర్వలేక వైసిపి నేతలు కుట్రలు చేస్తున్నారని మంత్రులు కొల్లు రవీంద్ర, బీసీ జనార్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు పరిశ్రమలు తెస్తుంటే, మాజీ సీఎం జగన్ కడుపు మంటతో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మత్స్యకారుల ప్రయోజనాల కంటే తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడమే జగన్‌కు ముఖ్యమని వారు విమర్శించారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి అడుగు తీర ప్రాంత అభివృద్ధి కోసమేనని మంత్రులు తేల్చి చెప్పారు.

Read also: Lok Sabha Delimitation: లోక్ సభ సీట్ల పునర్విభజనపై చంద్రబాబుకు రేవంత్ రెడ్డి లేఖ

Juvvaladinne Fishing Harbor Project

AP Politics: హార్బర్ ప్రైవేటీకరణ అబద్ధం: వాస్తవాలు వివరించిన మంత్రి

జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తం 114 ఎకరాల భూమిలో కేవలం 7 ఎకరాలను మాత్రమే సాగర్ డిఫెన్స్ యూనిట్‌కు కేటాయించామని తెలిపారు. 900 మీటర్ల జెట్టీలో కేవలం 150 మీటర్లు మాత్రమే ఆ సంస్థ వినియోగించుకుంటుందని, దీనివల్ల మత్స్యకారులకు ఎలాంటి నష్టం జరగదని ఆయన వివరించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వెల్లడించారు.

పరిశ్రమలను భయపెట్టడమే జగన్ పని

గతంలో అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలను తరిమేసిన వైసీపీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి పెట్టుబడిదారులను భయపెడుతోందని మంత్రులు ధ్వజమెత్తారు. జువ్వలదిన్నెలో మత్స్యకారులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని జగన్ ప్రయత్నిస్తున్నారని వారు విమర్శించారు. మత్స్యకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్వంసకర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని మంత్రులు ప్రజలకు మరియు మత్స్యకారులకు విజ్ఞప్తి చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ పై మంత్రి సవిత హర్షం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha