Actress Meena: కులం, మతం, లింగం వంటి తేడాలకు అతీతంగా… మనిషి ప్రవర్తన, వ్యక్తిత్వానికే సమాజంలో అసలైన ప్రాధాన్యత ఇవ్వాలంటూ ప్రముఖ సినీ నటి మీనా చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
సమాజంలో సరైన దృక్పథాన్ని పెంపొందించేలా ఉన్న ఆమె సందేశం నెటిజన్ల మనసులను గెలుచుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంటోంది.
Read Also : Salman Khan Court Notice:సల్మాన్ ఖాన్‌కు కోర్టు నోటీసులు
Caste and religion do not matter; humanity is what counts-Meena’s interesting comments.
భర్త మరణం తర్వాత జీవిత విలువలపై క్రమం తప్పకుండా స్పందిస్తున్న మీనా… కులం, మతం, పుట్టిన ప్రాంతం, లింగం అనేవి మనం పుట్టాక వచ్చి చేరిన గుర్తింపులు మాత్రమే. వాటి సాధన కోసం మనమేమీ కష్టపడలేదు, కాబట్టి వాటిని చూసుకుని గొప్పలు చెప్పుకోవడంలో ఎలాంటి అర్థం లేదు అని ఎంతో స్పష్టంగా వివరించారు.
Actress Meena: తోటివారి పట్ల మానవత్వమే అసలైన గుర్తింపు
ఒక మనిషి నిజమైన గుర్తింపు అతను చేసే పనులు, తోటివారి పట్ల చూపే మానవత్వంలోనే ఉంటుందని, అటువంటి మంచి లక్షణాల గురించే ప్రతి ఒక్కరూ గర్వపడాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో ఒక ఉత్తమమైన మనిషిగా మెలిగేందుకు ప్రయత్నించాలని కోరారు. మీనా వె వ్యక్తపరిచిన ఈ విలువైన భావాలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేష చర్చ జరుగుతోంది.

