Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సల్మాన్ ఖాన్‌కు కోర్టు నోటీసులు

సల్మాన్ ఖాన్‌కు కోర్టు నోటీసులు

వార్త 22 hrs ago

Salman Khan Court Notice: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) మరియు ఆయన సోదరి అల్విరా ఖాన్ (Alvira Khan) లకు చండీగఢ్ జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది.

'బీయింగ్ హ్యూమన్' (Being Human) జ్యువెలరీ షోరూమ్ ఫ్రాంచైజీ పేరుతో రూ.3 కోట్ల మేర మోసం జరిగిందన్న ఫిర్యాదు ఆధారంగా, వారిని అక్టోబర్ 5న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది.

Read Also :Raaka : అల్లు అర్జున్ మూవీలో షారుఖ్ ఖాన్.. నిజమేనా ?

Salman Khan Court Notice: కేసు వివరాలు & ప్రధాన అంశాలు

చండీగఢ్‌కు చెందిన అరుణ్ గుప్తా అనే వ్యాపారి 'బీయింగ్ హ్యూమన్' జ్యువెలరీ షోరూమ్ ఏర్పాటు కోసం రూ.3 కోట్లు పెట్టుబడి పెట్టారు. అయితే ఒప్పందం ప్రకారం కంపెనీ నుంచి సరైన సహకారం అందకపోవడం వల్ల తనకు భారీగా నష్టం వాటిల్లిందని కోర్టును ఆశ్రయించారు. అరుణ్ గుప్తా సేకరించిన ఆధారాలను పరిశీలించిన చండీగఢ్ జిల్లా కోర్టు, ఈ వ్యవహారంలో వివరణ ఇచ్చేందుకు అక్టోబర్ 5న నేరుగా హాజరుకావాలని సల్మాన్ ఖాన్, అల్విరా ఖాన్‌లతో పాటు మరికొందరికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆరోపణలను 'బీయింగ్ హ్యూమన్' సంస్థ గతంలోనే పూర్తిగా ఖండించింది. ఈ బిజినెస్ ఫ్రాంచైజీ కార్యకలాపాలతో సల్మాన్ ఖాన్‌కు ప్రత్యక్ష సంబంధం లేదని, ఫ్రాంచైజీ పర్యవేక్షణ ప్రత్యేక యాజమాన్యం చూసుకుంటుందని స్పష్టం చేసింది.

నాని తర్వాతే పవన్ కళ్యాణ్..?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha