Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కూలీల బొలేరో వాహనం బోల్తా..20 మందికి తీవ్ర గాయాలు!

కూలీల బొలేరో వాహనం బోల్తా..20 మందికి తీవ్ర గాయాలు!

వార్త 3 months ago

Annamayya District Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని చిన్నమండెం మండలం, కురవపల్లి గ్రామం సమీపంలో కూలీలతో ప్రయాణిస్తున్న ఒక బొలేరో వాహనం అదుపుతప్పి అకస్మాత్తుగా బోల్తా పడింది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ప్రయాణిస్తున్న దాదాపు 20 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వాహనం వేగంగా వెళ్తుండగా అదుపుతప్పడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.

Read Also :Anantapur Crime: వివాహితను వేధించిన యువకుడికి గ్రామస్థుల వినూత్న శిక్ష!

Annamayya District Road Accident: రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు

 njured laborers from the Chinnamandem accident are being treated

ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు, ప్రయాణికులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన కూలీలందరినీ అత్యవసర చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఉపాధి కోసం వెళ్తున్న కూలీలు ఇలా ప్రమాదానికి గురికావడంతో ఆయా గ్రామాల్లో మరియు ప్రమాద స్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

వాలీబాల్ నెట్ వైరుతో గొంతు నులిమి యువకుడి దారుణ హత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha