Guntur Crime: గుంటూరు జిల్లాలో తెనాలి రూరల్ పరిధిలోని కంచర్లపాలెం గ్రామ శివారులో ఒక యువకుడు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. స్థానిక వాలీబాల్ కోర్టు ప్రాంగణంలో మృతదేహం లభ్యం కావడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఈ ఘటన స్థానికంగా పెద్ద దుమారాన్నే లేపింది.
Read Also : Manikonda crime: నడిరోడ్డుపై మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించిన సైకో
Brutal murder of a young man by strangling him with a volleyball net wire!
Guntur Crime: మృతదేహం లభ్యం
వివరాల్లోకి వెళితే.. కంచర్లపాలెం గ్రామ శివారులోని వాలీబాల్ కోర్టులో ఒక యువకుడు నిర్జీవంగా పడి ఉండటాన్ని ఉదయాన్నే గమనించిన స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అక్కడ మృతదేహం ఉందన్న వార్త చుట్టుపక్కల ప్రాంతాలకు వేగంగా వ్యాపించడంతో జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న తెనాలి రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
మృతుడు కోపల్లె కార్తీక్‌గా గుర్తింపు
పోలిసుల విచారణ లో మరణించిన యువకుడిని కోపల్లె కార్తీక్ (18)గా గుర్తించారు. ఘటనా స్థలంలో ఉన్న పరిస్థితులను, ఆధారాలను బట్టి గుర్తుతెలియని దుండగులు వాలీబాల్ నెట్‌కు ఉండే బలమైన వైరును కార్తీక్ గొంతుకు గట్టిగా బిగించి, ఊపిరాడకుండా చేసి ప్రాణం తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com

