Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కూలీల మృతిపై మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి

కూలీల మృతిపై మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి

వార్త 1 week ago

Kakinada Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ రూరల్ కొవ్వూరు బ్రిడ్జి వద్ద జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో నలుగురు ఉపాధి హామీ కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

నిత్యం రెక్కాడితే గాని డొక్కాడని ఆ పేద కుటుంబాల్లో ఈ ఘటన కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం పనికి వెళ్లిన కూలీలు ఇలా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు.

Read Also:Puttaparthi AMCA: 5వ తరం ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన!

బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ

బాధిత కుటుంబ సభ్యులకు తన గాఢ సానుభూతిని తెలియజేసిన మంత్రి లోకేష్, ప్రభుత్వం వారికి అన్ని రకాలుగా తోడ్పాటునందిస్తుందని స్పష్టం చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరికొంతమంది కూలీలకు స్థానిక ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, వారికి అవసరమైన అత్యవసర చికిత్సలను వేగవంతం చేయాలని ఆయన కోరారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Kakinada Road Accident: ఉపాధి హామీ కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్ లారీ.. నలుగురు దుర్మరణం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha