Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కూలిన హనుమాన్ ఆలయ మండపం.. శిథిలాలో 30 మంది భక్తులు?

కూలిన హనుమాన్ ఆలయ మండపం.. శిథిలాలో 30 మంది భక్తులు?

వార్త 2 weeks ago

Parbhani Hanuman Temple Collapse: మహారాష్ట్రలోని పర్భాణి జిల్లాలో శనివారం ఒక దురదృష్టకర ఘోర ప్రమాదం సంభవించింది. భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసుకుంటున్న సమయంలో ఓ హనుమాన్ దేవాలయ స్లాబ్ (కప్పు) ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకుని ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం కావడంతో ఉదయాన్నే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగిన సమయంలో ఈ ప్రమాదం జరగడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Read Also : Ganpatipule Beach incident: మహారాష్ట్ర బీచ్‌లో విషాదం.. ఐదుగురు పర్యాటకులు మృతి!

 Hanuman temple pavilion collapses… 30 devotees in the debris?

Parbhani Hanuman Temple Collapse: ప్రార్థనలు చేస్తుండగా ఒక్కసారిగా..

పోలీసుల కథనం ప్రకారం.. పర్భాణి జిల్లాలోని సేలు తాలూకా పరిధిలో గల రావల్గావ్ గ్రామంలో ఈ పురాతన హనుమాన్ దేవాలయం ఉంది. శనివారం ఉదయం భక్తులు ఆలయ గర్భగుడి వెలుపల నిలబడి ప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో, పైన ఉన్న కాంక్రీట్ స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలి వారిపై పడింది. ఈ ప్రమాదంలో రావల్గావ్‌కు చెందిన ఉత్తమ్ రావు లహనే (65) అనే వృద్ధుడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని ప్రాణాలతో బయటకు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 30 మంది వరకు భక్తులు ఆ శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఐదుగురు భక్తులను తక్షణమే చికిత్స నిమిత్తం పొరుగునే ఉన్న జాల్నాలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిలో ఇద్దరి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్య వర్గాల సమాచారం.

కూలిపోవడానికి కారణం ఏంటి?

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ హనుమాన్ ఆలయం చాలా పురాతనమైనదని, దీనికి తోడు ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కాంక్రీట్ స్లాబ్ పూర్తిగా బలహీనపడిందని.. అదే ఈ కప్పు కూలిపోవడానికి ప్రాథమిక కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘోర ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

ముంబై ఐఐటీ క్యాంపస్‌లో చిరుతపులి కలకలం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha