Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కూలిన నిర్మాణంలో ఉన్న ఫ్యాక్టరీ షెడ్డు.. శిథిలాల కింద 23 మంది?

కూలిన నిర్మాణంలో ఉన్న ఫ్యాక్టరీ షెడ్డు.. శిథిలాల కింద 23 మంది?

వార్త 1 week ago

Kolkata factory shed collapse: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని తారతలా ప్రాంతంలో జూన్ 24న ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక భారీ ఫ్యాక్టరీ షెడ్ అకస్మాత్తుగా కూలిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది.

ఈ దురదృష్టకర ఘటనలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, కాంక్రీటు పలకలు, భారీ ఇనుప దూలాల కింద మరికొంతమంది కూలీలు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.

Read Also : Pune Trekker Death Case: మండుటెండలో 'హుడీ' ధరించిన వ్యక్తిపై పోలీసుల దృష్టితో బయటపడ్డ నిజం

 Factory shed under construction collapses; 23 people trapped under the debris?

Kolkata factory shed collapse: శిథిలాల కింద 23 మంది కార్మికులు?

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, ఫ్యాక్టరీ షెడ్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో అక్కడ సుమారు 50 నుండి 60 మంది వరకు కూలీలు పని చేస్తున్నారు. నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడ పెద్ద ఎత్తున దుమ్ము ధూళి పైకి లేచింది. భారీ శబ్దం రావడంతో స్థానిక నివాసితులు పరుగున వచ్చి చూసి, వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. లోపల ఉన్న వారిని రక్షించేందుకు తోటి సిబ్బంది, స్థానికులు హుటాహుటిన ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఆందోళనకర పరిస్థితి నెలకొంది.

సుమారు 23 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. గాయపడిన పలువురు కార్మికులను ఇప్పటికే స్థానికులు, తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. లోపల చిక్కుకున్న వారి పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది భారీగా ఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. భారీ క్రేన్లు, అధునాతన పరికరాల సహాయంతో కూలిపోయిన షెడ్డు శిథిలాలను తొలగిస్తూ లోపల ఉన్నవారిని ప్రాణాలతో కాపాడేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు. షెడ్డు కూలిపోవడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. నాణ్యతా లోపమా లేక మరేదైనా ప్రమాదమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రమాద తీవ్రత, బాధితుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.

మరికొన్ని నెలల్లో పెళ్లి.. అగ్నికీలల్లో చిక్కుకుని ప్రేమజంట మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha