Vegetable prices:తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావం వల్ల పంట దిగుబడి తగ్గడమే దీనికి ప్రధాన కారణం.
సరిపడా సరఫరా లేకపోవడంతో రోజురోజుకూ అన్ని రకాల కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి. పండుగల సమయం కావడంతో సామాన్య ప్రజలు మార్కెట్ కు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇంట్లో నెలకు అయ్యే నిత్యావసర ఖర్చులు అదనంగా పెరుగుతుండటంతో మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. బహిరంగ మార్కెట్లలో ఉల్లిపాయల ధర కిలో రూ.70 వరకు చేరడంతో వంటగది బడ్జెట్ తలకిందులవుతోంది. రైతులు తెచ్చే సరుకు డిమాండ్ కు తగ్గట్టు లేకపోవడంతో వ్యాపారులు కూడా ధరలు పెంచి విక్రయిస్తున్నారు. పండుగ వేళ కూరగాయల కొనుగోలు సామాన్యులకు భారంగా మారింది. రోజువారీ మార్కెట్ లో పెరిగిన ఈ రేట్లు ప్రజల జేబులకు పెద్ద కన్నం వేస్తున్నాయి.
BC Overseas Scholarships: స్కాలర్షిప్ గడువు పెరిగింది.. త్వరపడండి
Soaring vegetable prices during the festive season
భాగ్యనగరం భయపడుతోంది: ఈ కూరగాయల రేట్లు చూశారా?
హైదరాబాద్ లోని కూకట్పల్లి మోడల్ రైతు బజార్ లో ఇవాళ నమోదైన ధరలు పరిశీలిస్తే పరిస్థితులు స్పష్టంగా అర్థమవుతాయి. అక్కడ కిలో టమాటా రూ.23, వంకాయ రూ.23, బెండకాయ రూ.40, పచ్చిమిర్చి రూ.50, బజ్జి మిర్చి రూ.82 గా ఉన్నాయి. బీన్స్ రూ.45, క్యారెట్ రూ.40, గోబీపువ్వు రూ.30, కాకరకాయ రూ.32, బీరకాయ రూ.35, చిక్కుడుకాయ రూ.55 కి విక్రయిస్తున్నారు. బంగాళాదుంపలు రూ.20, బీట్రూట్ రూ.28, చామగడ్డ రూ.35, క్యాప్సికం రూ.60, చిలగడ దుంప రూ.40 కి లభిస్తున్నాయి. ఉల్లిగడ్డ కిలో రూ.40 కాగా, బయటి మార్కెట్లో మరింత ఎక్కువగా ఉంది. అల్లం పాతది కిలో రూ.180, కొత్త అల్లం రూ.120, వెల్లుల్లి ఏకంగా రూ.260 పలుకుతోంది. ఎండుమిర్చి కిలో రూ.280 వరకు చేరింది. నిత్యం వాడే దినుసులు కూడా భారీగా పెరగడంతో కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు.
Vegetable prices:బెజవాడలో సెంచరీకి దగ్గరగా: ధరల మంట ఎప్పటివరకు?
విజయవాడ లోని ప్రధాన రైతు బజార్లలో కూడా ఇదే రకమైన ధరల పెరుగుదల కనిపిస్తోంది. ఇక్కడ కిలో టమాటా రూ.31, వంకాయ రూ.30, బెండకాయ రూ.18, పచ్చిమిర్చి రూ.52 కు అందుబాటులో ఉన్నాయి. క్యారెట్ రూ.48, చిక్కుళ్లు రూ.70, బీరకాయ రూ.36, బీట్ రూట్ రూ.38, కీరదోస రూ.54 గా నమోదయ్యాయి. బీన్స్ కిలో ఏకంగా రూ.95 వరకు పలుకుతుండగా, క్యాప్సికం రూ.68 కు విక్రయిస్తున్నారు. ఉల్లిపాయల రేటు గతంలో రూ.20 ఉండగా, ఇప్పుడు రైతు బజార్ లోనే రూ.35 నుంచి రూ.50 కి చేరింది. వీధి వ్యాపారులు, కిరాణా షాపుల్లో మాత్రం ఉల్లిని రూ.70 వరకు విక్రయిస్తున్నారు. పండుగ వేళ ముఖ్యమైన కూరగాయల ధరలు అదుపు తప్పడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో సరఫరా మెరుగైతేనే ధరలు తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
Epaper: epaper.vaartha.com

