BC Overseas Scholarships:తెలంగాణలో విదేశాల్లో చదువుకోవాలనే లక్ష్యంతో ఉన్న విద్యార్థులకు ఇది తీపి కబురు. మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా ప్రభుత్వం రూ.
20 లక్షలు ఆర్థిక సాయం అందిస్తోంది. ముఖ్యంగా బీసీ, ఈబీసీ విద్యార్థుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. విదేశీ విద్య కోసం దరఖాస్తు గడువు పెంచారు. అర్హత ఉన్న యువత వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
BC Overseas Vidyanidhi: ఈనెల 30 వరకు అప్లై చేసుకోండి
Overseas Education Fund application date extended
అక్టోబర్ 31 వరకు చివరి అవకాశం ఉందో లేదో తెలుసా?
మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద దరఖాస్తు చేసుకునే గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించారు. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బి. బాలామాయాదేవి ఈ విషయాన్ని ప్రకటించారు. మొదట గడువు అక్టోబర్ 15 తో ముగియాల్సి ఉంది. విద్యార్థుల ప్రయోజనం కోసం గడువు చివరి తేదీ పెంచారు. చివరి నిమిషం వరకు ఆగకుండా త్వరగా దరఖాస్తు చేసుకోవాలి.
BC Overseas Scholarships:ఎవరికి ఈ భారీ సాయం లభిస్తుంది?
ఈ పథకం ద్వారా ఎంపికైన విద్యార్థులకు రూ. 20 లక్షలు వరకు ఆర్థిక సహాయం అందుతుంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో మాస్టర్స్ లేదా పీహెచ్‌డీ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షలు లోపు ఉండాలి. వయస్సు 35 ఏళ్లు మించకూడదు. డిగ్రీలో 60 శాతం మార్కులు తప్పనిసరి. GRE లో 260, GMAT లో 550, TOEFL లో 60, IELTS లో 6.0 బ్యాండ్ స్కోర్ అవసరం.
ఈ ఒక్క లింక్ ద్వారా వెంటనే అప్లై చేయండి!
అర్హత ఉన్నవారు తెలంగాణ ఈ-పాస్ వెబ్‌సైట్ telanganaepass.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆదాయ ధృవపత్రం, మార్కుల షీట్లు, పరీక్ష స్కోర్‌లు సిద్ధం చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి. ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే దరఖాస్తు పూర్తి చేయాలి.
Epaper: epaper.vaartha.com

