Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు: మంత్రి బిసి జనార్దన్ రెడ్డి

కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు: మంత్రి బిసి జనార్దన్ రెడ్డి

వార్త 2 months ago

AP Development: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని నేలటూరుపాళెం గ్రామంలో రూ. 30.59 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో నడవాలంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. 2014 నుంచి 2019 వరకు జరిగిన తెలుగుదేశం పాలనలో పల్లెల్లో అభివృద్ధి పనులు పండుగలా సాగాయని గుర్తు చేశారు. మోదీ ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ తోడ్పాటుతో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం ఇప్పుడు మరింత వేగంగా ముందుకు దూసుకుపోతోందని ఆయన స్పష్టం చేశారు.

Read also: TG Politics: జీవన్ రెడ్డి పార్టీ వీడటంపై రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు

Minister BC Janardhan Reddy at Muthukuru

AP Development: నేలటూరు గ్రామ తరలింపుపై ప్రత్యేక దృష్టి

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం దోపిడీపైనే దృష్టి పెట్టారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ముఖ్యంగా నేలటూరు గ్రామస్తులు కాలుష్య సమస్యతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గత టీడీపీ ప్రభుత్వమే గుర్తించి గ్రామ తరలింపు ప్రక్రియను మొదలుపెట్టిందని ఆయన వివరించారు. మాదరాజుగూడూరు వద్ద భూమిని సేకరించి ఇళ్ల నిర్మాణాన్ని కూడా ప్రారంభించామని, అయితే గత ప్రభుత్వం రాజకీయ కక్షతో ఆ పనులను మధ్యలోనే నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారుల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణం కూడా పునాదుల స్థాయిలోనే ఆగిపోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిచిపోయిన అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, మాదరాజుగూడూరు వద్ద ఇళ్ల నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించామని నేతలు వెల్లడించారు. ఆర్ అండ్ ఆర్ కాలనీలను పూర్తి చేయడానికి ఏపీ జెన్ కో మరియు సెయిల్ సంస్థల నుంచి నిధులు రావాల్సి ఉందని, ఒప్పందం ప్రకారం నిధులు కేటాయిస్తే పనులు వేగంగా పూర్తవుతాయని తెలిపారు. ఫిషింగ్ జెట్టీ నిర్మాణంతో పాటు కాలనీల బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటానని సోమిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మరియు పలువురు కూటమి నేతలు పాల్గొనగా, గ్రామస్తులు వారికి ఘనంగా ఆత్మీయ స్వాగతం పలికారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఏప్రిల్ 20న మేడిగడ్డకు సీఎం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha