Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జీవన్ రెడ్డి పార్టీ వీడటంపై రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు

జీవన్ రెడ్డి పార్టీ వీడటంపై రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు

వార్త 2 months ago

TG Politics: సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత 40 ఏళ్లుగా ఆయన వెంటే ఉండి, అండగా నిలిచిన కార్యకర్తలను జీవన్ రెడ్డి నట్టేట ముంచారని రేవంత్ ఆరోపించారు.

పార్టీలో ఆయనకు ఎప్పుడూ సరైన గౌరవం ఇచ్చామని, ఎక్కడా తక్కువ చేసి చూడలేదని సీఎం స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం దశాబ్దాల అనుబంధాన్ని వదులుకోవడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.

Read also: Raghav Chadha: పదవి పోయిన కొద్దిరోజులకే రాఘవ్ చద్దాకు భద్రత తొలగింపు!

CM Revanth Reddy speech on Jeevan Reddy

TG Politics: కేసీఆర్ ముందు మోకరిల్లడం దారుణం

జగిత్యాల ప్రాంత కార్యకర్తల ఆత్మగౌరవాన్ని జీవన్ రెడ్డి కేసీఆర్ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ప్రత్యర్థి పార్టీ నేత ముందు చేతులు కట్టుకుని నిలబడటం తనను కలిచివేసిందని అన్నారు. 2023 ఎన్నికల నుంచి మొన్నటి మున్సిపల్ ఎన్నికల వరకు జీవన్ రెడ్డి అడిగిన వారికే టికెట్లు ఇచ్చామని రేవంత్ గుర్తు చేశారు. అయినప్పటికీ మొండి పట్టుదలతో పార్టీని వీడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు.

జగిత్యాల కాంగ్రెస్‌కు అండగా ఉంటాం

వ్యక్తి కంటే పార్టీనే గొప్పదని నమ్మిన జగిత్యాల కార్యకర్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. త్వరలోనే స్వయంగా జగిత్యాలకు వచ్చి స్థానిక నేతలను, కార్యకర్తలను కలుస్తానని రేవంత్ ప్రకటించారు. జీవన్ రెడ్డి కుటుంబానికి కూడా మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పినా ఆయన వినలేదని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్న వారితో చేతులు కలపడం సరైన నిర్ణయం కాదని హితవు పలికారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

అంబేద్కర్ ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నాం: మంత్రి అచ్చెన్నాయుడు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha