Dailyhunt
కూటమి విడిపోతే జగన్ దే విజయం: ఉండవల్లి

కూటమి విడిపోతే జగన్ దే విజయం: ఉండవల్లి

వార్త 2 weeks ago

Undavalli Arun Kumar: ఏపీ రాజకీయ విశ్లేషణలో తనదైన ముద్ర వేసిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, 2029 ఎన్నికల సమీకరణాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.

కూటమి భవిష్యత్తు, జగన్ రీ-ఎంట్రీ అవకాశాలు, కాపు ఓట్ల చీలకపై ఆయన విశ్లేషణ చాలా ఆసక్తికరంగా ఉంది.

Read Also:CPI(M) Srinivasa Rao: తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

Undavalli Arun Kumar: కూటమి భవిష్యత్తు ప్రధాని మోదీ చేతుల్లోనే!

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కొనసాగింపుపై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు చేశారు.2014 తరహాలోనే 2029లోనూ కూటమి కలిసి ఉంటేనే గట్టి పోటీ ఉంటుందని, ప్రస్తుతం జగన్ గ్రాఫ్ పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.కూటమి ఉంటుందా లేదా అన్నది ప్రధాని మోదీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, అధికారం కోసం బీజేపీ ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఒకవేళ కూటమి విడిపోతే మాత్రం 2019 తరహాలో జగన్ విజయం ఏకపక్షం అవుతుందని జోస్యం చెప్పారు.

 Undavalli Arun Kumar interview

లోకేష్ సీఎం ప్రచారం.. కాపు ఓట్ల చీలిక

రాబోయే రోజుల్లో నాయకత్వ మార్పుపై జరిగే ప్రచారం కూటమికి నష్టం కలిగించవచ్చని ఉండవల్లి హెచ్చరించారు.చంద్రబాబు తర్వాత నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం గట్టిగా సాగితే, అది కాపు ఓటర్లలో అసంతృప్తికి దారితీసి ఓట్లు చీలే ప్రమాదం ఉందని విశ్లేషించారు.గత ఎన్నికల్లో జగన్ కమ్మ, కాపు సామాజిక వర్గాలకు వ్యతిరేకమనే ప్రచారం కూటమికి బాగా కలిసి వచ్చిందని ఆయన గుర్తు చేశారు.

2024 గెలుపు ఆ రోజే డిసైడ్ అయ్యింది!

గత ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. రాజమండ్రి జైలులో చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిసిన రోజే 2024 ఫలితం ఖరారైందని ఉండవల్లి అన్నారు. జగన్ ప్రభుత్వం పవన్, బాబులను ఇబ్బంది పెట్టడం వల్లే వారు ఏకమయ్యారని, ఆ కలయికే ‘వార్ వన్ సైడ్’ అయ్యేలా చేసిందని తెలిపారు.

అసెంబ్లీలో వారి నిర్ణయాన్ని చెప్పాల్సింది

రాజ్యాంగంలో రాజధాని అనే పేరు లేదని.. 2014 ఎన్నికల తర్వాత అమరావతిని రాజధాని నిర్ణయించిన సమయంలో వైఎస్సార్‌సీపీ అసెంబ్లీలో వారి నిర్ణయాన్ని చెప్పాల్సిందన్నారు. ఆ తర్వాత మూడు రాజధానుల పేరుతో కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.. రాజధాని విషయంలో ఎవరి ఎజెండా వారికి ఉందన్నారు. రాష్ట్రంలో మతపరమైన అంశాలపై వివాదాలు నడుస్తున్నాయని.. గతంలో ఇలా మతాల గురించి పెద్దగా చర్చ లేదని.. 2014 తర్వాత మొత్తం మారిపోయిందన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha