Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కుట్టుమిషన్ల కోసం 4.6 లక్షల దరఖాస్తులు: మంత్రి పొన్నం

కుట్టుమిషన్ల కోసం 4.6 లక్షల దరఖాస్తులు: మంత్రి పొన్నం

వార్త 1 week ago

Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్రంలో బీసీ మహిళల ఉపాధిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు' పథకానికి ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది.

ఇప్పటివరకు ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.6 లక్షల దరఖాస్తులు అందినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సోమవారం నాడు బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ గణాంకాలను విడుదల చేశారు.

గడువు మరియు అధికారులకు ఆదేశాలు

ఈ పథకానికి దరఖాస్తులు సమర్పించడానికి నిర్ణయించిన గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనుందని మంత్రి స్పష్టం చేశారు. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి బీసీ మహిళకు ఈ సంక్షేమ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఏ ఒక్క అర్హరాలైన మహిళ కూడా ఈ సదవకాశాన్ని కోల్పోకుండా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన సూచించారు.

Ponnam Prabhakar: గురుకులాలు మరియు హాస్టళ్లపై సమీక్ష

కుట్టు మిషన్ల పథకంతో పాటుగా, రాష్ట్రంలోని బీసీ గురుకుల పాఠశాలలు అలాగే సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన సదుపాయాలు మరియు విద్యా ప్రమాణాలను మెరుగపరిచే దిశగా అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యా రంగంలో బీసీ విద్యార్థులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

యూట్యూబర్ నందన దంపతులపై ప్రజావాణిలో బాధితుల ఫిర్యాదు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha