YouTuber Rama Nandana: యునైటెడ్ కింగ్‌డమ్‌లో (యూకే) మంచి ఉద్యోగాలు ఇస్తామంటూ అమాయక నిరుద్యోగులను నమ్మించి, వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ప్రముఖ యూట్యూబర్ నందన మరియు ఆమె భర్త మధుకర్ కలిసి విదేశీ ఉద్యోగాల పేరుతో ఈ ఘరానా మోసానికి పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ దంపతుల మోసాల బారిన పడిన బాధితులు సోమవారం నేరుగా ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమాన్ని ఆశ్రయించి అధికారులకు ఫిర్యాదు చేశారు.

నకిలీ పత్రాలతో యూకే వీసాలంటూ దారుణ మోసం
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. యూకే ప్రభుత్వమే స్వయంగా తమ కన్సల్టెన్సీకి ఉద్యోగుల నియామక అధికారం ఇచ్చిందని నందన దంపతులు నమ్మబలికారు. ప్రధానంగా స్టూడెంట్ మరియు విజిటర్ వీసాలపై యూకేకు వెళ్లి, గడువు ముగియనున్న వారిని లక్ష్యంగా చేసుకుని వారికి శాశ్వత వర్క్ వీసాలు ఇప్పిస్తామని నమ్మించారు. ఈ నమ్మకంతో ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 25 లక్షల నుంచి ఏకంగా రూ. 95 లక్షల వరకు నగదు వసూలు చేశారు. అయితే ఆ కన్సల్టెన్సీ సమర్పించిన డాక్యుమెంట్లు అన్నీ నకిలీవని తేలడంతో యూకే ప్రభుత్వం బాధితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణలోని వికారాబాద్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలతో పాటు ఏపీ, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన అనేక మంది ఈ మోసానికి బలయ్యారు.
YouTuber Rama Nandana: ప్రజావాణి అధికారులను ఆశ్రయించిన బాధితులు.. దర్యాప్తునకు హామీ
సోమవారం బేగంపేటలోని జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో బాధితులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్‌పర్సన్, ప్రజావాణి ఇన్‌చార్జ్ గద్వాల విజయలక్ష్మి, రాష్ట్ర నోడల్ ఆఫీసర్ విద్యాసాగర్, ఎన్నారై సలహా కమిటీ ఛైర్మన్ డాక్టర్ వినోద్ కుమార్‌లను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదును స్వీకరించిన ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరిపించేందుకు వీలుగా రాష్ట్ర డీజీపీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని, బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ట్యాంక్‌బండ్‌పై ఉద్రిక్తత.. గణేశ్ నిమజ్జన ఆంక్షలపై ఉత్సవ సమితి రచ్చ

