Medak District Tragedy: మండలంలోని మక్త లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో చోటుచేసుకున్న విషాద ఘటన తీవ్ర కలకలం రేపింది. కుటుంబ గొడవల నేపథ్యంలో భార్య నాగాధర్ బేతమ్మ (45) హైదరాబాద్‌లోని దుండిగల్ లో ఆత్మహత్యకు పాల్పడగా..
తల్లి మృతిని తట్టుకోలేక కుమారుడు నాగాధర్ ప్రవీణ్ (21) కూడా కోలపల్లి గ్రామ శివారులో ఆత్మహత్య చేసుకున్నాడు.
స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. మక్త లక్ష్మాపూర్‌కు చెందిన నాగాధర్ శివయ్య, బేతమ్మ దంపతులు ఏడాది క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లి దుండిగల్ లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. దంపతులు ఇద్దరూ వాచ్‌మెన్‌లుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. శుక్రవారం కుటుంబంలో గొడవ జరిగిన అనంతరం బేతమ్మ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.
Guntur Crime: ఎంత ఘోరం.. ప్రేమకు అడ్డు చెప్పిందని కన్నతల్లిని చంపిన కూతురు!
Mother dies by suicide following family disputes; son takes his own life out of anguish.
Medak District Tragedy: తల్లి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
తల్లి మృతి విషయం తెలుసుకున్న కుమారుడు ప్రవీణ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. తల్లి మరణాన్ని తట్టుకోలేక అదే రోజు రాత్రి కోలపల్లి శివారులో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కొద్ది గంటల వ్యవధిలోనే తల్లి, కుమారుడు మృతిచెందడంతో మక్త లక్ష్మాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి శివయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు వేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Epaper: epaper.vaartha.com

