Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య!

కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య!

వార్త 3 weeks ago

Vikarabad Crime: నేటి సమాజంలో చిన్న చిన్న కుటుంబ కలహాలకే విలువైన ప్రాణాలు బలవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. క్షణిక ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలను తీరని విషాదంలోకి నెట్టేస్తున్నాయి.

సమస్య ఏదైనా సరే, ఆ సమయంలో ఆవేశానికి లోనుకాకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకుని పరిష్కరించుకోవడం ఎంతో ముఖ్యం. తాజాగా వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న విషాద ఘటన మరోసారి కుటుంబ కలహాల తీవ్రతను గుర్తుచేస్తోంది.

Read Also : Tirupati crime: తిరుమలలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

 Mother commits suicide by jumping into a well with her two children due to family disputes!

Vikarabad Crime: భర్తతో గొడవపడి పిల్లలతో సహా బయటకు.

తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మాటుగూడ గ్రామంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా భర్త రాజుతో గొడవపడిన భార్య మమత (30), తన ఇద్దరు చిన్న పిల్లలైన కూతురు జనశ్రీ (8), కుమారుడు సాకేత్ (4)లను తీసుకుని శుక్రవారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. భార్యాభర్తల నడుమ తలెత్తిన మనస్పర్థలే ఈ దారుణ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది.

బావిలో శవమై తేలిన తల్లీకూతురు.. బాలుడి కోసం గాలింపు

ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మమత, తన పిల్లలతో కలిసి సోమన్ గుర్తి శివారులోని ఒక వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టగా, మమత, కూతురు జనశ్రీ మృతదేహాలు బావిలో తేలడంతో వాటిని బయటకు తీశారు. నీటిలో మునిగిపోయిన చిన్నారి సాకేత్ మృతదేహం కోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఋషికొండ బీచ్‌లో విషాదం.. సముద్రంలో కొట్టుకుపోయిన ముగ్గురు బాలురు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha