Chinna Srinu : విజయనగరం జిల్లా పరిషత్ (జెడ్పీ) ఛైర్మన్ చిన శ్రీను వైఎస్సార్‌సీపీకి గుడ్‌బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరడం వెనుక తన కూతురు సిరి సహస్ర రాజకీయ భవిష్యత్తే ప్రధాన కారణమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు వైఎస్సార్‌సీపీలో కీలక పాత్ర పోషించిన ఆయన, అనూహ్యంగా పార్టీ మారడం సంచలనంగా మారింది. రాబోయే రోజుల్లో తన కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు లేదా ఇతర ముఖ్య పదవుల్లో నిలబెట్టాలని చిన శ్రీను భావించారు. అయితే పార్టీలోని అంతర్గత సమీకరణలు, సొంత నేతల నుంచే ఎదురైన ప్రాధాన్యతల పోరు కారణంగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుని టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు తెలుస్తోంది.

బొత్స కుటుంబంతో విభేదాలు: టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్‌తో వేడెక్కిన విజయనగరం రాజకీయం
విజయనగరం జిల్లాలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తన కుమార్తె అనూషను తదుపరి జెడ్పీ రేసులో నిలబెట్టేందుకు సన్నాహాలు చేస్తుండటంతో, చిన శ్రీను కూతురు సిరి సహస్రకు అవకాశాలు తగ్గుతాయనే భావన వ్యక్తమైంది. జెడ్పీ పదవి విషయంలో బొత్స కుటుంబం మరియు చిన శ్రీను మధ్య మొదలైన విభేదాలు చివరకు వైఎస్సార్‌సీపీని వీడే వరకు వెళ్లాయి. ఈ క్రమంలోనే టీడీపీలో చేరిన చిన శ్రీను, త్వరలోనే విజయనగరం జిల్లాకు చెందిన మరికొందరు వైఎస్సార్‌సీపీ నేతలు మరియు ప్రజాప్రతినిధులు కూడా టీడీపీ గూటికి చేరబోతున్నారని చేసిన వ్యాఖ్యలు స్థానిక రాజకీయాన్ని మరింత వేడెక్కించాయి.
దుర్గమ్మ ఆలయ బోర్డులో చోటు..సీఎం, మంత్రికి ధన్యవాదాలు తెలిపిన సుస్మిత కొణిదెల

