Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
క్యారెట్ లేన్ జువెలరీ షాపులో రూ.2 కోట్ల వజ్రాలు చోరీ

క్యారెట్ లేన్ జువెలరీ షాపులో రూ.2 కోట్ల వజ్రాలు చోరీ

వార్త 2 weeks ago

CaratLane Jewelry Shop: హైదరాబాద్- వరంగల్‌ జాతీయ రహదారి పరిధిలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల ప్రసిద్ధ 'క్యారెట్ లేన్' డైమండ్స్ జ్యువెలరీ షోరూమ్‌లో తెల్లవారుజామున భారీ దొంగతనం జరిగింది.

గుర్తుతెలియని వ్యక్తులు పక్కా పథకం ప్రకారం లోపలికి చొరబడి రూ. 2 కోట్లకు పైగా విలువ చేసే వజ్రాభరణాలను ఎత్తుకెళ్లడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

RTC elections 2026: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికల సమరం

 Diamonds worth Rs 2 crore stolen from Carrot Lane jewellery shop.

CaratLane Jewelry Shop: పక్కా పథకంతో షట్టర్ వంచి దోపిడీ

దుండగులు ముందస్తు ప్రణాళికతోనే ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి వేళ షోరూమ్ షట్టర్‌ను బలవంతంగా వంచి లోపలికి ప్రవేశించారు. అనంతరం లోపల డిస్‌ప్లే కోసం ఉంచిన గ్లాస్ బాక్సులను పగలగొట్టి, విలువైన డైమండ్ ఆభరణాలన్నింటినీ ఊడ్చేసి క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు.

ఉదయాన్నే చోరీ విషయాన్ని గమనించిన స్థానికులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్, మేడిపల్లి ఏసీపీ మోహన్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ జలంధర్‌ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ మరియు ఉప్పల్ జోన్ ఎస్‌వోటీ (SOT) బృందాలు అక్కడ లభించిన వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించాయి.

సీసీటీవీ ఫుటేజీ పరిశీలన

దొంగలు ఏ మార్గం ద్వారా వచ్చారు, చోరీ పూర్తి చేసిన తర్వాత ఏ దారిలో పరారయ్యారనే అంశాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. జాతీయ రహదారి పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. విచారణ పూర్తయిన తర్వాత ఈ చోరీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని వెల్లడించారు.

Epaper: epaper.vaartha.com

భయపెడుతున్న ఎలక్ట్రిక్ బస్సుల అగ్నిప్రమాదాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha