Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎసిబి వలలో బాపట్ల మునిసిపల్ ఆర్ఐ

ఎసిబి వలలో బాపట్ల మునిసిపల్ ఆర్ఐ

వార్త 1 month ago

Bapatla ACB Raid: బాపట్ల మున్సిపాలిటీలో ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటూ ఎసిబి వలలో చిక్కాడు. వివరాల్లోకి వెళితే చినగంజాం మండలం, కోతపాలెం గ్రామానికి చెందిన దేవరకొండ సుబ్బారావు బాపట్ల పట్టణంలోని సంజయ్ గాంధీనగర్లో రెండు ఆర్సిసి భవనాలను తన భార్య నాగేంద్రమ్మ, చిన్న కుమార్తె మోనిక నెల 21 వ తేదీన సుబ్బారావు బాపట్ల మున్సి పల్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి కొనుగోలు చేసిన ఆస్తులను మున్సిపల్ రికార్డుల్లో తన భార్య, కుమార్తె పేర్ల పై మ్యూటేషన్ చేయాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ షేక్ ఇమామను సంప్రదించాడు.

Read Also : AP Green Energy Corridor: ఏపీలో రూ.21,500 కోట్లతో జిఇసి అభివృద్ధి

 Revenue inspector caught taking bribe.

Bapatla ACB Raid: రూ. 50 వేలు డిమాండ్.. వేధించిన అధికారి

సుబ్బారావు భార్య, పేరుతో దరఖాస్తును ప్రాసెస్ చేసి పై అధికారులకు పంపించేందుకు షేక్ ఇమామ్ రూ.50 వేలు డిమాండ్ చేశాడు. అందులో లంచంగా రూ.25 వేలు, మిగతా రూ.25 వేలు మ్యూటేషన్, ఇతర ప్రభుత్వ ఫీజుల కోసం ఇవ్వాలని కోరాడు. సుబ్బారావు లంచం ఇవ్వలేనని చెప్పినా, ఇన్స్పెక్టర్ ప్రవర్తనకు భయపడి చివరకు అంగీకరించాడు. ముందుగా సుబ్బారావు భార్య పేరుతో దరఖాస్తును ప్రాసెస్ చేస్తానని చెప్పి ఆస్ఐ రూ.38 వేలు తీసుకున్నాడు. మళ్లీ అదనంగా మరో రూ.12 వేలు కోరగా సుబ్బారావు చెల్లించాడు. ఇదేవిధంగా సుబ్బారావు చిన్న కుమార్తెకు సంబంధించిన పనిని ప్రాసెస్ చేసి పూర్తిచేయడానికి కూడా మ్యూటేషన్ ఛార్జీలు తదితరాల పేరుతో డబ్బులు డిమాండ్ చేయడంతో విసుగెత్తి పోయిన సుబ్బారావు గుంటూరులోని ఎసిబి అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

టీ దుకాణం వద్ద ఏసీబీ వల

ఈ క్రమంలో సోమవారం నిందితుడు షేక్ ఇమామ్ సూర్యలంక, బాపట్ల రోడ్డులో ఒక టీ దుకాణం వద్ద సుబ్బారావు నుండి రూ.25 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్్యండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన నిందితుడిని విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి కోర్టలో హాజరుపరచనున్నట్లు ఎసిబి అధికారులు పేర్కొన్నారు. అలాగే నిందితుడి నివాసం, కార్యాలయాల్లో ఎసిబి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఏపీలో ఇంధన సెగ.. రోడ్లపైకి వైసీపీ శ్రేణులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha