Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లారీని ఢీకొట్టిన క్రూజర్..ఐదుగురు మృతి!

లారీని ఢీకొట్టిన క్రూజర్..ఐదుగురు మృతి!

వార్త 3 months ago

Karnataka Road Accident: కర్ణాటకలోని కలబురగి జిల్లా లాడ్లాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన ఓ క్రూజర్ వాహనం, ఎదురుగా వస్తున్న భారీ లారీని బలంగా ఢీకొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రయాణిస్తున్న సమయంలో క్రూజర్ వాహనం అదుపుతప్పి, లారీని ముఖాముఖి ఢీకొట్టడం వల్లనే ఈ విషాదం చోటుచేసుకుంది.

Read Also :Rangareddy crime: గర్భం దాల్చిన మైనర్ విద్యార్థిని.. నిందితుడిపై పోక్సో కేసు నమోదు

ఎదురెదురుగా ఢీకొన్న వాహనాలు

 Five of Family Killed Karnataka

ఈ ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో క్రూజర్ వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. లారీ వేగానికి క్రూజర్ ముందుభాగం పూర్తిగా ధ్వంసమై ఇనుప చుట్టలా మారిపోవడంతో, మృతదేహాలన్నీ వాహనంలోనే ఇరుక్కుపోయాయి. మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతులను క్యాష్వార్‌, హుస్సేన్‌ షా, మహబూబ్‌ అలీ, రసూల్‌ బీ, ఫాతిమా అలీలుగా నిర్ధారించారు.

Karnataka Road Accident: దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో ఎంతో శ్రమించి మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణమా లేక డ్రైవర్ నిద్రమత్తా అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కస్టడీ పిటిషన్ విచారణ వాయిదా, బెయిల్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha