PG LAWCET Applications: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు లా కాలేజీల్లో మూడు సంవత్సరాలు, 5 సంవత్సరాల కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే లా సెట్-2026 పరీక్షను, పీజీ లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీ లాసెట్-2026 పరీక్షను ఈ నెల 18న నిర్వహంచనున్నారు.
ఇందుకు సంబంధించి ఆదివారం సాయంత్రం వరకు 66,620 దరఖాస్తులు వచ్చినట్టు లాసెట్, పీజీ లాసెట్-2026 కన్వీనర్ ప్రొఫెసర్ బి విజయలక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12 నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు.
Read Also: TG EAPCET 2026: ఎప్ సెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నేటితో పూర్తి
LAWCET and PG LAWCET Applications
PG LAWCET Applications: అపరాధ రుసుం రూ.10వేలతో 15 వరకు దరఖాస్తుకు అవకాశం
అపరాధ రుసుం రూ.4వేలతో ఈ నెల 13 వరకు, రూ.10వేల అపరాధ రుసుంతో ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షను ఈ నెల 18న నిర్వహించనున్నారు. ఉదయం రెండు సెషన్లలో మూడు సంవత్సరాల లా కోర్సు పరీక్షను నిర్వహించనున్నారు. మొదటి సెషన్ను ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు, రెండో సెషన్ను మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల వరకు నిర్వహించనున్నారు.
పరీక్షా షెడ్యూల్
మధ్యాహ్నం సెషన్లో సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు 5 సంవత్సరాల లా కోర్సు తోపాటు పీజీలో అడ్మిషన్ల కోసం పరీక్షను నిర్వ హించనున్నారు. 3 సంవత్సరాల లా కోర్సులో ప్రవేశాల కోసం 47,400 దరఖాస్తులు రాగా, 5 సంవత్సరాల లా కోర్సులో ప్రవేశాల కోసం 14,020 దరఖాస్తులు వచ్చాయి. పీజీ లా కోర్సులో ప్రవేశాల కోసం 5200 దరఖా స్తులు వచ్చాయి. గత ఏడాది కంటే సుమారు 10వేల దరఖాస్తులు అదనంగా వచ్చాయి. గత ఏడాది లాసెట్, పీజీ లాసెట్కి 56వేల దరఖాస్తులు రాగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 66,620 దరఖాస్తులు వచ్చాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

