Veerabhadrudu Telugu Movie Review: స్టార్ హీరో సూర్య, త్రిష, ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'కరుప్పు'. ఈ చిత్రం తెలుగులో 'వీరభద్రుడు' అనే టైటిల్‌తో నేడు (మే 15) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సోషియో-ఫాంటసీ డ్రామా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
Read Also:Peddi Movie: పెద్ది ప్రమోషన్లకు జాన్వీ దూరం.. కారణం అదేనా?
కథ
మీను (అనఘా మాయ రవి) అనే యువతి కిడ్నీ సమస్యతో బాధపడుతుంటుంది. ఆమె ఆపరేషన్ ఖర్చుల కోసం తమ వద్ద ఉన్న బంగారమంతా తీసుకుని తండ్రి (ఇంద్రాన్స్)తో కలిసి హైదరాబాద్ వస్తుంది. అయితే, దురదృష్టవశాత్తూ రైల్వే స్టేషన్‌లోనే దొంగలు ఆ బంగారాన్ని ఎత్తుకెళ్తారు. పోలీసులు దొంగలను పట్టుకుని నగలను రికవరీ చేసినప్పటికీ, అది తిరిగి దక్కాలంటే కోర్టు ప్రక్రియ ద్వారానే సాధ్యమవుతుందని చెబుతారు. ఇందుకోసం ఫేమస్ లాయర్ బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ)ని కలవమంటారు.
బేబీ కృష్ణ కేవలం డబ్బు కోసమే పనిచేసే ఒక అవినీతి న్యాయవాది. సులభంగా తేలిపోయే ఈ కేసును కూడా తను డబ్బు సంపాదించడం కోసం వాయిదాల మీద వాయిదాలు వేయిస్తూ ఆ పేద తండ్రీకూతుళ్లను తిప్పుతుంటాడు. ఆపరేషన్ సమయం దాటిపోతుండటంతో నిస్సహాయుడైన మీను తండ్రి.. వీరభద్ర స్వామిని వేడుకుంటాడు. ఆ భక్తుడి ఆక్రందన ఆలకించిన ఆ దేవుడే స్వయంగా లాయర్ సూర్య (సూర్య) రూపంలో భూమిపైకి వస్తాడు.

మొదట బేబీ కృష్ణను భయపెట్టాలని చూసిన దేవుడికి ఇక్కడి న్యాయ వ్యవస్థలోని లోపాలను చూపిస్తూ.. “దేవుడు వచ్చినా ఈ సిస్టమ్‌ను మార్చలేడు. అంతగా అయితే నీ దేవుడి శక్తులు వాడకుండా సాధారణ లాయర్‌గా ఈ కేసు గెలిచి చూపించు” అని ఛాలెంజ్ చేస్తాడు బేబీ కృష్ణ. మరి మానవ రూపంలోకి వచ్చిన వీరభద్రుడు ఈ సవాల్‌ను ఎలా స్వీకరించాడు? మధ్యలో లాయర్ ప్రీతి (త్రిష) పాత్ర ఏంటి? చివరికి మీను ప్రాణాలు దక్కాయా లేదా? అనేది మిగతా కథ.
Veerabhadrudu Telugu Movie Review: కథనం
వీరభద్రుడు సినిమా లైన్ చాలా అద్భుతంగా ఉంటుంది.. దేవుడే దిగివచ్చినా కూడా ఇప్పుడున్న న్యాయవ్యవస్థను బాగు చేయలేరు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు ఆర్జే బాలాజీ. సినిమా కథనం ప్రధానంగా న్యాయం జరగడంలో అయ్యే ఆలస్యం, సామాన్యులను వ్యవస్థ ఎలా పీల్చి పిప్పిచేస్తుంది అనే పాయింట్ చుట్టూ అద్భుతంగా అల్లారు. అవినీతిని ఏదో పైపైన, మనకు సంబంధం లేని విషయంగా చూపించకుండా, సామాన్యుడి కన్నీటికి దానికి ముడిపెట్టి కథనాన్ని నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఫాంటసీ ఎలిమెంట్స్ మొదలవ్వడానికి ముందే ఫస్ట్ హాఫ్‌లో తండ్రీకూతుళ్ల ఎపిసోడ్‌తో ఆడియన్స్‌ను ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు.
సామాన్యుడి నిస్సహాయతను ప్రేక్షకులకు కనెక్ట్ చేసిన విధానం బ్రిలియంట్‌గా ఉంటుంది. కమర్షియల్ మాస్ మూమెంట్స్‌ను, సోషల్ మెసేజ్‌ను బ్యాలెన్స్ చేస్తూ రాసుకున్న స్క్రీన్‌ప్లే సినిమాకు మేజర్ హైలైట్. న్యాయం ఆలస్యమైతే అది అన్యాయం కిందే లెక్క అనే పాయింట్‌ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. సెకండాఫ్‌లో ఫాంటసీ ఎలిమెంట్స్ కాస్త ఎగ్జాజరేట్ అయినట్లు అనిపించినా, మొదటి సగంలో చేసిన ఎమోషనల్ సెటప్ స్ట్రాంగ్‌గా ఉండటం వల్ల ఆడియన్స్ కథలో లీనమవుతారు.
Epaper: epaper.vaartha.com
పెద్ది నుంచి 'రాంబుజ్జి' ఎంట్రీ.. మరో గ్లింప్స్ వీడియో విడుదల

