Indiramma Illu: హైదరాబాద్‌లోని కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్‌కు సంబంధించి లబ్ధిదారులకు అలాట్‌మెంట్ లెటర్లు పంపిణీ చేయనున్నారు.
సెప్టెంబర్ 21, సోమవారం నుంచి తెలంగాణ హౌసింగ్ బోర్డు లబ్ధిదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లు, వాట్సాప్‌కు అలాట్‌మెంట్ లెటర్లను పంపించనుంది. హౌసింగ్ బోర్డు వెబ్‌సైట్‌లోనూ ఈ పత్రాలను అందుబాటులో ఉంచనున్నారు.
Read Also :Ponguleti Srinivas Reddy: డబుల్ బెడ్‌రూం ఇళ్లపై కీలక ప్రకటన
16 నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక

ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్ పథకం తొలి దశలో హైదరాబాద్ CURE పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫ్లాట్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో సుమారు 480 ఫ్లాట్ల చొప్పున నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. మొత్తం 7,680 ఫ్లాట్ల ప్రణాళికకు అనుగుణంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కోసం డ్రా నిర్వహించగా, 16 నియోజకవర్గాల్లో 7,340 ఫ్లాట్లకు లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారిని కూడా ఎంపిక చేసినట్లు సమాచారం.
రాయదుర్గంలో 2.85 ఎకరాల్లో టవర్
మరోవైపు సెరిలింగంపల్లి నియోజకవర్గంలోని రాయదుర్గంలో ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్ నిర్మాణానికి సెప్టెంబర్ 21న శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. మల్కం చెరువు వెనుక భాగంలో హౌసింగ్ బోర్డుకు చెందిన 2.85 ఎకరాల స్థలంలో ఈ టవర్ నిర్మించనున్నారు. ఈ భూమి మార్కెట్ విలువ సుమారు రూ.752 కోట్ల నుంచి రూ.767 కోట్ల వరకు ఉండొచ్చని హౌసింగ్ బోర్డు అంచనా వేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
Indiramma Illu: ఒక్కో ఫ్లాట్‌కు రూ.5 లక్షల సబ్సిడీ
ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్‌లో ఒక్కో ఫ్లాట్‌కు ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందించనుంది. లబ్ధిదారుడు మిగిలిన రూ.6 లక్షలను వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో ఫ్లాట్‌కు సుమారు 528 చదరపు అడుగుల బిల్ట్‌అప్ ఏరియా ఉండనుంది. CURE ప్రాంతంలో నిర్మించే ఇళ్లను లబ్ధిదారుల జీవనోపాధి, పిల్లల విద్యకు ఇబ్బంది కలగకుండా జనావాసాలకు సమీపంలో నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

