Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లైలా మనసులో ఉన్నది అతనే.. ఓపెన్ అయిపోయిన అందాల నటి!

లైలా మనసులో ఉన్నది అతనే.. ఓపెన్ అయిపోయిన అందాల నటి!

వార్త 2 weeks ago

Laila: నటి లైలా ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని విషయాన్ని సరదాగా పంచుకున్నారు. మీ కో-స్టార్లలో ఎవరంటే ఇష్టం అని అడగ్గా.. వెంటనే సూర్య పేరు చెప్పారు.

అయితే జ్యోతిక తనను ఆటపట్టిస్తుందని నవ్వుతూ వ్యాఖ్యానించారు. నిజానికి సూర్యతో తనకు క్రష్ మాత్రమే కాదని, అంతకంటే గొప్ప స్నేహబంధం ఉందని ఆమె స్పష్టం చేశారు. వారిద్దరూ కలిసి నటించిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Read also: Avika Gor: 'అగ్లీ స్టోరీ' షూటింగ్‌లో ఇబ్బంది పడ్డాను.. అవికా గోర్ షాకింగ్ కామెంట్స్

 Actress Laila talking about Suriya

Laila: తెలుగు సినిమాలకు దూరం కావడానికి అసలు కారణం

టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హోదా అనుభవించిన లైలా.. చాలా కాలంగా ఇక్కడ సినిమాలు చేయడం లేదు. దీనిపై స్పందిస్తూ తనకు సరైన కథలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తల్లి లేదా సోదరి పాత్రల కోసమే దర్శకులు తనను సంప్రదిస్తున్నారని ఆమె చెప్పారు. అటువంటి పాత్రలు చేయడానికి తనకు ఆసక్తి లేదని, అందుకే మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నానని క్లారిటీ ఇచ్చారు.

మళ్ళీ తెరపై చూడాలని కోరుకుంటున్న అభిమానులు

లైలా నటించిన ‘శైలజా కృష్ణమూర్తి’ సినిమా తర్వాత ఆమె నేరుగా తెలుగులో కనిపించలేదు. కానీ ఆమెకున్న ఫ్యాన్ బేస్ ఏమాత్రం తగ్గలేదు. తమిళంలో వరుస అవకాశాలు వస్తున్నా.. తెలుగులో మళ్ళీ మంచి పాత్రతో ఎంట్రీ ఇవ్వాలని ఆమె ఆశిస్తున్నారు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు వస్తే తప్పకుండా టాలీవుడ్‌లో మళ్ళీ కనిపిస్తానని లైలా హామీ ఇచ్చారు. ఆమె రీ-ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

విజయ్ 'జన నాయకుడు' టైటిల్ కార్డ్ లీక్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha